Prithviraj Sukumaran: సలార్‌లో ఒక్క క్యారెక్టర్‌కి ఒకే సినిమాలో.. 5 భాషల్లో డబ్బింగ్ చెప్పా

ABN , First Publish Date - 2023-12-10T21:48:34+05:30 IST

ప్ర‌భాస్ తాజాగా న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం స‌లార్‌. అయితే తాజాగా ఈ సినిమాలో ప్ర‌భాస్ ప్రాణ స్నేహితుడిగా ప్ర‌ధాన పాత్ర‌ పోషిస్తున్న మ‌ళ‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ త‌న పొర్ష‌న్‌కు సంబంధించి డ‌బ్బింగ్ పూర్తి చేశారు.

Prithviraj Sukumaran: సలార్‌లో ఒక్క క్యారెక్టర్‌కి ఒకే సినిమాలో.. 5 భాషల్లో డబ్బింగ్ చెప్పా
Prithviraj Sukumaran

ప్ర‌భాస్ తాజాగా న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం స‌లార్‌ (Salaar Cease Fire). కేజీఎఫ్ 1,2ల త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌డంతో స‌లార్‌పై ప్ర‌పంచ‌ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ సినిమా మొద‌టి భాగం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. డిసెంబ‌ర్ 22 న విడుద‌ల కానుండ‌గా ఇటీవ‌లే ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనుండ‌డంతో మేక‌ర్స్ చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలో ప్ర‌భాస్ (Prabhas Raju) ప్రాణ స్నేహితుడిగా ప్ర‌ధాన పాత్ర‌ పోషిస్తున్న మ‌ళ‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran ) త‌న పొర్ష‌న్‌కు సంబంధించి డ‌బ్బింగ్ పూర్తి చేశానని నా క్యారెక్టర్‌కి ఒకే సినిమాలో.. 5 భాషల్లో డబ్బింగ్ చెప్పానని అది నాకు మాత్రమే దక్కిన అదృష్టమని అన్నారు. నాకు గ‌ర్వంగా ఉందంటూ సోష‌ల్ మీడియా ఎక్స్‌లో ఓపోస్టు పెట్ట‌గా నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.


హొంబలే ఫిల్మ్స్ (hombale films) బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈసినిమాలో శృతిహాస‌న్ క‌థానాయిక‌ కాగా, శ్రియా రెడ్డి, జగపతి బాబు కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. కేజీఎఫ్ చిత్రాల‌కు సంగీతం అందించిన‌ రవి బస్రూర్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించారు.

Updated Date - 2023-12-10T22:00:26+05:30 IST