Varun tej - Lavanya : చిరు ఇంట పెళ్లి సందడి మొదలైంది!

ABN , First Publish Date - 2023-10-07T13:21:20+05:30 IST

కొణిదెల (Konidela Family) కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్‌తేజ్‌ (Varun tej) - లావణ్యా త్రిపాఠీ (Lavanya tripati) వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఇటీవల ఇరువురికి పెళ్లి ఖరారైంది.

Varun tej - Lavanya : చిరు ఇంట పెళ్లి సందడి మొదలైంది!

కొణిదెల (Konidela Family) కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్‌తేజ్‌ (Varun tej) - లావణ్యా త్రిపాఠీ (Lavanya tripati) వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఇటీవల ఇరువురికి పెళ్లి ఖరారైంది. జూన 9న ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేది ఇంకా వెల్లడించలేదు కానీ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. శుక్రవారం రాత్రి చిరంజీవి ఇంట్లో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీల ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. (Pre wedding celebrations)

Chiranjeevi.jpg

ఈ విషయాన్ని చిరంజీవి ఫొటోలు షేర్‌ చేసి తెలిపారు. ఇందులో చిరంజీవి, నాగబాబు కుటుంబ సభ్యులతోపాటు చిరు చెల్లెళ్లు, మేనళ్లులు సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌లతోపాటు అల్లు శిరీష్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Chiranjeevi 2.jpg

వరుణ్‌తేజ్‌, లావణ్య కలిసి 'మిస్టర్‌' చిత్రంలో నటించారు. తదుపరి వీరిద్దరి కలయికలో 'అంతరిక్షం’ చిత్రం తెరకెక్కింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో లావణ్య, వరుణ్‌తేజ్‌ త్వరలో మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే స్పెయినలో వరుణ్‌ బ్యాచలర్‌ పార్టీ ఇచ్చారు. ఇప్పుడు చిరు ఇంట ప్రీ వెడ్డింగ్‌ పనులు షురూ అయ్యాయి. నవంబర్‌ మొదటివారంలో వరుణ్‌తేజ్‌ - లావణ్యల పెళ్లి జరగనుందని తెలుస్తోంది.

Updated Date - 2023-10-07T13:21:20+05:30 IST