Preme Vimanam - OTT : ‘ప్రేమ విమానం’ స్ట్రీమింగ్ ఎక్కడంటే

ABN , First Publish Date - 2023-09-16T19:23:04+05:30 IST

భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ రూపొందిస్తోన్న ‘పేమ విమానం’ అనే వెబ్ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైంది. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.

Preme Vimanam - OTT : ‘ప్రేమ విమానం’ స్ట్రీమింగ్ ఎక్కడంటే

భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ రూపొందిస్తోన్న ‘పేమ విమానం’ (Prema Vimanam) అనే వెబ్ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైంది. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా ఆసక్తిని పెంపొందించాయి.

సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.

Updated Date - 2023-09-16T19:23:04+05:30 IST