సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prem Rakshith: ఆర్థిక సమస్యల నుంచి ఆస్కార్‌ దాకా!

ABN, First Publish Date - 2023-03-20T18:40:07+05:30

ప్రేమ్‌ రక్షిత్‌.. పరిచయం అవసరం లేని డాన్స్‌ మాస్టర్‌. ‘ఛత్రపతి’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకూ ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ్‌ రక్షిత్‌.. ({rem Rakshith) పరిచయం అవసరం లేని డాన్స్‌ మాస్టర్‌. ‘ఛత్రపతి’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వరకూ ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టించింది. విదేశీయులు, హాలీవుడ్‌ దర్శకులు సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించింది. ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్‌ (Oscar 95)వేడుకలో ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ కేటగిరీలో ఆస్కార్‌ అందుకున్న సంగతి తెలిసిందే! ఈ పాటకు ప్రధాన ఆకర్షణ ప్రేమ్‌రక్షిత్‌ మాస్టర్‌ అందిందచిన నృత్యరీతులే! ఇప్పుడు అందరి దృష్టి ప్రేమ్‌ రక్షిత్‌ వైపు మళ్లింది. విశ్వవేదికపై హీరోలు, దర్శకుడితోపాటు ప్రేమ్‌ రక్షిత్‌ పేరు కూడా మార్మోగింది. (Naatu Naatu song)

ఆస్కార్‌ వేడుక అనంతరం హైదరాబాద్‌లో వచ్చిన ప్రేమ్‌రక్షిత్‌ మీడియాతో మాట్లాడారు. కెరీర్‌ బిగినింగ్‌లో పడ్డ ఇబ్బందుల గురించి తెలిపారు. ‘‘నేను కృష్ణానగర్‌ నుంచి వచ్చినవాడిని. అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించా. రాజమౌళి(Rajamouli) ఇంట్లో కార్తికేయ.. కాలభైరవ.. సింహాలకు డాన్స్‌ నేర్పేవాడిని. మరో ఇద్దరు కుర్రాళ్ల ఇళ్లకు కూడా వెళ్లి క్లాసులు తీసుకునేవాడిని.. అలా వచ్చిన డబ్బుతోనే అతి కష్టం మీద రోజులు గడుపుతూ వెళ్లేవాడిని. ‘‘రాజమౌళి వరుసగా అవకాశాలు ఇచ్చారు. సై.. ఛత్రపతి.. విక్రమార్కుడు.. మగధీర, యమదొంగ ఇలా అన్ని సినిమాలకు పనిచేస్తూ వచ్చాను. ‘నాటు నాటు’ పాట అటు ఎన్టీఆర్‌, ఇటు చరణ్‌ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కంపోజ్‌ చేయవలసి వచ్చింది. దానికి ప్రతిఫలం ఈ పురస్కారం. ఈ పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ ప్రకటించినప్పుడు మా అందరికీ మాట రాలేదు. కళ్ల వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి. నిజంగా ఈ పాట కోసం తారక్‌, చరణ్‌ చాలా కష్టపడ్డారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందుతో కెరీర్‌ ప్రారంభించిన నేను ‘ఆస్కార్‌’ వేదిక వరకూ వెళ్లడం, నేను పని చేసిన పాటకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుమించి ఓ కళాకారుడికి ఏం కావాలి’’ అని అన్నారు. (Happy with oscar)

Updated Date - 2023-03-20T18:54:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!