Praveen IPS: ‘ప్రవీణ్ ఐపీఎస్’ గ్లిమ్స్ వదిలారు
ABN , First Publish Date - 2023-10-28T21:44:20+05:30 IST
ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నీల మామిడాల నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రవీణ్ ఐపిఎస్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నీల మామిడాల నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రవీణ్ ఐపిఎస్’ (Praveen IPS). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్ (Nanda Kishore), రోజా (Roja) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్‌గా ఈ ‘ప్రవీణ్ ఐపిఎస్’ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా నిర్మాత వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు. ఈ చిత్ర గ్లిమ్స్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ఐపిఎస్ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు రమణ తేజ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ బాయి తదితరులు పాల్గొన్నారు. (Praveen IPS Movie Glimpse Released)
ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రవీణ్ ఐపీఎస్ సినిమా ఒక మంచి కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. అదే విధంగా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా సక్సెస్ సాధించి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. (Praveen IPS Movie)
అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ బాయి మాట్లాడుతూ... ప్రవీణ్ ఐపిఎస్ సినిమా గ్లిమ్స్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మోషన్ పోస్టర్, టైటిల్ అన్ని బాగున్నాయి. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నానని తెలుపుతూ చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
========================
*Satyam Rajesh: సత్యం రాజేష్ టైమ్ నడుస్తోంది
***********************************
*Rekha: ఊపిరి ఉన్నంత వరకు.. నా కోరిక అదే..
*********************************