Leo : ప్రశాంత్‌ నీల్ ప్రశంసలు.. సినిమా సాక్షిగా దండలు మార్చుకున్నారు

ABN , First Publish Date - 2023-10-19T16:26:23+05:30 IST

'మాస్టర్‌’ చిత్రం తర్వాత విజయ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లియో’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం చిత్రం బృందం చెప్పినట్లే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

Leo : ప్రశాంత్‌ నీల్ ప్రశంసలు.. సినిమా సాక్షిగా దండలు మార్చుకున్నారు

'మాస్టర్‌’ చిత్రం తర్వాత విజయ్‌(Vijay) - లోకేశ్‌ కనగరాజ్‌ (lokesh Kanagaraj)కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లియో’.(leo) ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం చిత్రం బృందం చెప్పినట్లే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. సినిమా సక్సెస్‌ పట్ల సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదిగా చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ పొగడ్తల వర్షం కురిపించారు.

‘‘లియో’ సినిమా అద్భుతంగా ఉంది. విజయ్‌ యాక్షన్‌ నెక్ట్స్‌ లెవల్లో ఉంది. ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్‌ ఉంది. అలాగే అనిరుద్ధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. అందరూ ఈ సర్‌ప్రైజ్‌ను థియేటర్‌లో చూసి థ్రిల్‌ అవ్వండి. చివరి 30 నిమిషాలు సినిమాకే అదనపు ఆకర్షణ. ‘లియో’ సినిమా మాత్రమే కాదు.. ఓ వేడుక’’ అని పోస్ట్‌ చేశారు. సినిమా సక్సెస్‌ అయిన ఆనందంలో అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. చెన్నైలోని ఓ థియేటర్లో విజయ్‌ను అభిమానించే ఓ జంట దండలు మార్చుకోవడం వైరల్‌గా మారింది. చెన్నైకు చెందిన వెంకటేష్‌, మంజుష అనే జంట అక్టోబర్‌ 20న పెళ్లిచేసుకోనున్నారు. వాళ్లిద్దరూ ‘లియో’ థియేటర్లో ప్రేక్షకుల ఎదుట ఉంగరాలు, దండలు మారుల్చకున్నారు. దీని కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తునట్లు తెలిపారు.

ఈ చిత్రం రిలీజ్‌కు ముందు లోకేశ్‌ కనగరాజ్‌ మాట్లాడుతూ ''సినిమా చిత్రీకరణ సమయంలో ఒత్తిడి అనిపించలేదు కానీ రిలీజ్‌కు ముందు మాత్రం టెన్షన్  పడ్డా. ఐమాక్స్‌లో రిలీజ్‌ చేయాలని ముందు అనుకోలేదు. తర్వాత డిసైడ్‌ అయ్యాం. ఈ చిత్రం తీయడానికి ముఖ్య కారణం ‘మాస్టర్‌’ సినిమానే. విజయ్‌ సినిమాలు అంటే ఏదో ఒక కాంట్రావర్సీ అవుతుందని.. ‘లియో’ వియషంలో ట్రెలర్లో అభ్యంతరకర పదాలు వాడినందుకు ఎన్నో విమర్శలు వచ్చాయి’’ అని అన్నారు.

Updated Date - 2023-10-19T16:26:23+05:30 IST