Prabhas: అవన్నీ అయితేనే.. లెక్క కుదిరేది... లైన్‌ క్లియర్‌ అయ్యేది!

ABN , First Publish Date - 2023-04-27T14:12:44+05:30 IST

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌... ‘బాహుబలి’తో ప్రభాస్‌ యూనివర్సెల్‌ లెవల్లో గుర్తింపు పొందారు. లెక్కల మాస్టార్‌ సుకుమార్‌... ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల సక్సెస్‌ సుకుమార్‌ ప్యాన్‌ ఇండియా డైరెక్టర్స్‌ జాబితాలో చేరారు.

Prabhas: అవన్నీ అయితేనే.. లెక్క కుదిరేది... లైన్‌ క్లియర్‌ అయ్యేది!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌... (Prabhas)

‘బాహుబలి’తో ప్రభాస్‌ యూనివర్సెల్‌ లెవల్లో గుర్తింపు పొందారు.

లెక్కల మాస్టార్‌ సుకుమార్‌... (Sukumar)

‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల సక్సెస్‌ సుకుమార్‌ ప్యాన్‌ ఇండియా డైరెక్టర్స్‌ జాబితాలో చేరారు.

ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటనే అభిమానులు గాల్లో తేలిపోతుంటారు. ఆ సినిమా రేంజ్‌ వేరుగా ఉంటుంది. ప్రభాస్‌ కూడా సుకుమార్‌తో ఓ సినిమా చేయాలనుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. (Prabhas - Sukumar movie)

ఇద్దరికీ ఓ సినిమా కమిట్‌మెంట్‌ కూడా ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలి కానీ ఎవరి బిజీతో వాళ్ళు ఉండడం వల్ల డిలే అయింది. త్వరలోనే ఈ కాంబినేషన్‌ సెట్‌ అవ్వబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్‌ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేయాలి. ఈ చిత్రాన్ని ప్రకటించారు కానీ.. దానికి సంబంధించి ఇప్పటి దాకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఆ సినిమా కాస్త అటు ఇటు అయితే సుకుమార్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లే అనీ, ఆ గ్యాప్‌లో ప్రభాస్‌ - సుక్కూ కాంబోకు సెట్‌ అయ్యే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.

లవ్‌స్టోరీని తెరకెక్కించడంలో సుక్కూ మాస్టర్‌. ఇప్పటికే ప్రభాస్‌ కోసం ఓ పర్‌ఫెక్ట్‌ స్టోరీ లైన్‌ సిద్థం చేశారట. ఈ సారి ఓ పీరియాడికల్‌ స్టోరీ సిద్ధం, రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. ప్రభాస్‌ ఇప్పటికే కథ విన్నారట. పుష్ప - పుష్ప -2 సినిమాకు మధ్య గ్యాప్‌లో సుకుమార్‌ ఈ కథపై వర్క్‌ చేసినట్టు తెలిసింది. పుష్ప -2 పూర్తయ్యాక కాస్త విరామం తీసుకుని పూర్తి స్థాయిలో ఈ కథ సిద్థం చేయాలని సుకుమార్‌ భావిస్తున్నారట. ప్రభాస్‌ కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ‘సలార్‌’, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె, మారుతితో కమిట్‌ అయిన చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. అలాగే సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’, మైత్రీ సంస్థలో సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ సినిమాలు ప్రకటించి ఉన్నాయి. ఇవన్నీ ఓ దారికి వస్తే కానీ ప్రభాస్‌కు, సుక్కూకు లెక్క కుదురుతుంది.. లైన్‌ క్లియర్‌ అవుతుంది

Updated Date - 2023-04-27T14:13:37+05:30 IST