Prabhas: సలార్‌ అంగీకరించడానికి కారణం ఏంటంటే..

ABN , Publish Date - Dec 25 , 2023 | 12:16 PM

పాన్  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం 'సలార్‌' సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నారు. గత రెండు చిత్రాలు నిరుత్సాహపరచడంతో ఈ సినిమా విజయాన్ని, అన్ని రకాలుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌బాటలో కొనసాగుతోంది.

Prabhas:  సలార్‌ అంగీకరించడానికి కారణం ఏంటంటే..

పాన్  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas)ప్రస్తుతం 'సలార్‌' (Salaar) సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నారు. గత రెండు చిత్రాలు నిరుత్సాహపరచడంతో ఈ సినిమా విజయాన్ని, అన్ని రకాలుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ ((Prashanth neel) దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌బాటలో కొనసాగుతోంది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో చేరింది. తాజాగా ప్రభాస్‌ ఓ హాలీవుడ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం అంగీకరించడం వెనకున్న ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

‘‘సలార్‌ లైన్  వినగానే ఒక మెరుపులా అనిపించింది. కథ, దర్శకుడు నెరేట్‌ చేసిన తీరు ఎంతో నచ్చింది. అందుకే విన్న వెంటనే అంగీకరించా. ఇన్నేళ్ల నా జర్నీలో ఇదొక భిన్నమైన పాత్ర. ఛాలెంజ్‌తో కూడుకున్నది. ‘బాహుబలి’ నా కెరీర్‌కు ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నా. అందులో భాగంగానే ‘సలార్‌’ను అంగీకరించా. నేటి ప్రేక్షకులు వైవిధ్యమైన కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అని కాకుండా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ  అని గుర్తిస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్‌నీల్‌ వంటి దర్శకులతో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. సలార్‌ పార్ట్‌ 1 చివరిలోనే రెండో భాగం ఉంటుందని స్పష్టం చేశాం. మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండో పార్ట్‌ మరింత అద్భుతంగా ఉంటుంది. అంచనాలకు మించి ఉంటుంది’’ అరి ప్రభాస్‌ చెప్పారు. సినిమా టీమ్‌ ఊహించినట్లుగా అంచనాలను అందుకుందీ చిత్రం. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’, సందీప్‌రెడ్డి వంగా తో ‘స్పిరిట్‌’లో నటిస్తున్నారు. మారుతిలో ఓ చిత్రంతో బిజీగా ఉన్నారు. 

Updated Date - Dec 25 , 2023 | 02:08 PM