Prabhas: ‘రాజా డీలక్స్‌’ కూడా ఆ దార్లోనే వెళ్తుందా?

ABN , First Publish Date - 2023-05-31T13:18:24+05:30 IST

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే! తాజాగా రూపొందుతున్న ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలు కూడా రెండు భాగాలుగా విడుదలవుతాయనే టాక్‌ వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజా డీలక్స్‌’(వర్కింగ్‌ టైటిల్‌) కూడా అదే దార్లో వెళ్లబోతోందని టాక్‌.

Prabhas: ‘రాజా డీలక్స్‌’ కూడా ఆ దార్లోనే వెళ్తుందా?

ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’(Bahubali) రెండు భాగాలుగా విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే! తాజాగా రూపొందుతున్న ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలు కూడా రెండు భాగాలుగా విడుదలవుతాయనే టాక్‌ వినిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజా డీలక్స్‌(Raja deluxe)’(వర్కింగ్‌ టైటిల్‌) కూడా అదే దార్లో వెళ్లబోతోందని టాక్‌. ఈ మేరకు నెట్టింట వార్తలు కూడా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌ మీద ఉంది. తాత మనవళ్ల కథతో హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని తెలిసింది. అయితే ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిసింది. (Raja deluxe in two parts?)

ప్రస్తుతం రెండు పార్టులు ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా పార్‌-1, పార్టు-2లగా మారుతి తెరకెక్కిస్తారని భావించారంతా. అయితే అందులో నిజం లేదని తాజాగా మారుతి సన్నిహితులు నుంచి సమాచారం అందింది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌ కథానాయిక. మరో ఇద్దరు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ప్రచారంలో ఉంది. నిధీ అగర్వాల్‌, శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-05-31T13:18:24+05:30 IST