Prabhas - Kriti Sanon Engagement: మాల్దీవుల్లో కృతితో నిశ్చితార్థం!?.. స్పందించిన ప్రభాస్‌ టీం

ABN , First Publish Date - 2023-02-09T09:56:52+05:30 IST

గత కొంతకాలంగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas)కి నటి కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరగగా..

Prabhas - Kriti Sanon Engagement: మాల్దీవుల్లో కృతితో నిశ్చితార్థం!?.. స్పందించిన ప్రభాస్‌ టీం
Prabhas

గత కొంతకాలంగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas)తో నటి కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరగగా.. ఈ నటులు ఇద్దరూ కూడా ఆ వార్తలను కొట్టి పారేశారు. అయినా వార్తలకు ఏమాత్రం బ్రేక్ పడట్లేదు. ఈ తరుణంలో వారిద్దరూ మాల్దీవుల్లో నిశ్చితార్థం (Engagement) చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Kriti.jpg

ఈ విషయాన్ని తెలుపుతూ స్వయం ప్రకటిత సినీ విమర్శకుడు ఉమైర్‌ సంధు (Umair Sandhu) ట్విట్టర్‌లో తాజాగా ఓ పోస్ట్‌ని షేర్‌ చేశాడు. అందులో.. ‘బ్రేకింగ్ న్యూస్: కృతిసనన్, ప్రభాస్‌ నిశ్చితార్థం వచ్చే వారం మాల్దీవులలో జరగనుంది!! వారి చాలా సంతోషిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి గురించి న్యూస్‌ మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ వార్తలపై తాజాగా ప్రభాస్‌ టీం స్పందించింది. 'ఆ కథనాలలో ఎటువంటి నిజం లేదు. ఇది కేవలం కొందరి ఊహ మాత్రమే. ప్రభాస్, కృతి ఇద్దరూ సహ-నటులు, మంచి స్నేహితులు మాత్రమే' అని ప్రభాస్‌ సన్నిహితులు చెప్పుకొచ్చారు.

కాగా.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీత, రాముడి పాత్రల్లో వీరు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్‌‌తో పాటు ఇతర అంశాలపై విమర్శలు రావడంతో జూన్ 16, 2023కి ఈ మూవీ విడుదలని వాయిదా వేశారు.

Updated Date - 2023-02-09T10:10:27+05:30 IST