Adipurush: బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడిపోయిన ప్రభాస్ సినిమా, భారీ నష్టాలు

ABN , First Publish Date - 2023-06-26T14:48:42+05:30 IST

'ఆదిపురుష్' కలెక్షన్స్ రోజు రోజుకీ దారుణంగా పడిపోతున్నాయి. మొదటి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్ మాత్రమే ఈ సినిమాని కొంచెం కాపాడింది అనీ, తరువాత వారం రోజులకు గాను రూ 58 కోట్లు మాత్రమే వసూలు చేసిందని అంటున్నారు. ఈ సినిమా డిజాస్టర్ కిందకే వస్తుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Adipurush: బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడిపోయిన ప్రభాస్ సినిమా,  భారీ నష్టాలు
Prabhas in Adipurush

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన 'ఆదిపురుష్' #Adipurush కలెక్షన్స్ రెండో వారం ఒక్క ఆదివారం తప్పితే, పెద్దగా ప్రభావం ఏమీ లేదనే చెప్పాలి. #AdipurushCollections ఈ సినిమాకి మొదటి మూడు రోజుల కలెక్షన్స్ తప్పితే, నాలుగో రోజు నుండి బాగా పడిపోయాయి అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈ సినిమా నిర్వాహకులు మాత్రం ఈ సినిమా పది రోజులకు గాని రూ 450 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని పోస్టర్స్ వేశారు. అయితే ఇందులో నిజం ఎంతో వుందో వాళ్ళకే తెలియాలి.

adipurushwar.jpg

ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ మొదలయ్యింది. రామాయణం #Ramayanam ప్రాతిపదికగా తీసిన ఈ సినిమా మాటల రచయిత మనోజ్ ముంతషీర్ (Manoj Muntashir) మీద అయితే విమర్శల వెల్లువ బాగా ఎక్కువయింది. ఎందుకంటే రామాయణంలో పాత్రలు ఇంచుమించు అందరికీ తెలిసినవే! అటువంటి పాత్రలచేత ఏవేవో మాటలు మాట్లాడించిన మాటల రచయితని ఎక్కువ విమర్శించారు.

దేశం అంతా ఈ సినిమా మీద నిరసనలు వ్యక్త పరిచారు. అల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AllIndiaCineWorkersAssociation) అయితే ఈ సినిమా దర్శకుడు, నిర్మాత, మాటల రచయిత మీద ఒక కేసు బుక్ చెయ్యాలని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా (AmitShah) కి ఒక లెటర్ కూడా రాసారు. అలాగే ఈ సినిమాని నిషేధించాలని కూడా చాలామంది డిమాండ్ చేశారు.

Adipurush-1.jpg

ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా గత సోమవారం నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మూడు రోజుల్లో రూ 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా గత ఏడు రోజుల్లో కేవలం రూ 58 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందనే ఎంత ఘోరంగా ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి అర్థం అవుతోంది. తెలుగులో ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (PeoplesMediaFactory) సంస్థ రూ 165 కోట్లకు తీసుకొని చాలా ఏరియాస్ లో వేరేవాళ్లకు అమ్మేశారు.

పదిరోజులకు గాని ఈ సినిమా కేవలం రూ 274 కోట్ల రూపాయలు మాత్రమే వసూల్ చేసిందని, ఈ సినిమాకి అయిన ఖర్చు సుమారు రూ 500 కోట్లు నుండి రూ 600 కోట్లవరకు ఉంటుందని, చాలా ఏరియాస్ లో ఈ సినిమా తీసుకున్న వాసరికి నష్టం వాటిల్లడం ఖాయమని కూడా అంటున్నారు.

Updated Date - 2023-06-26T14:48:42+05:30 IST