Project k: అమెరికాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సందడి!

ABN , First Publish Date - 2023-07-18T19:24:59+05:30 IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’(Project k) . నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 20న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అమెరికాలోని ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొనుంది.

Project k: అమెరికాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సందడి!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’(Project k) . నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 20న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అమెరికాలోని ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొనుంది. ఇప్పటికే ప్రభాస్‌, రానా ఇతర టీమ్‌ అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు కార్‌ ర్యాలీ నిర్వహించారు. కార్లను ‘ప్రాజెక్ట్‌- కె’ లోగో రూపంలో పార్క్‌ చేసి ఫ్యాన్స్‌ అభిమానాన్ని చాటుకున్నారు.

1.jpg

అంతే కాదు అభిమానులంతా ‘ప్రాజెక్ట్‌- కె’ ప్రత్యేక టీ షర్ట్‌ ధరించి ర్యాలీతో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే వీడియోలను వైజయంతి సంస్థ ట్విట్టర్‌లో షేర్‌ చేసి ఫ్యాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు జరగనున్న ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’ ఈ వేడుకలో చిత్ర బృందమంతా పాల్గొననుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

3.jpg2.jpg

Updated Date - 2023-07-18T19:25:05+05:30 IST