Prabhas: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న రెబల్ స్టార్!

ABN , First Publish Date - 2023-01-14T18:18:08+05:30 IST

బాహుబలి’ (Baahubali) సినిమాతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ చిత్రం ఇచ్చిన కిక్‌తో రెబల్ స్టార్ నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి.

Prabhas: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న రెబల్ స్టార్!

‘బాహుబలి’ (Baahubali) సినిమాతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ చిత్రం ఇచ్చిన కిక్‌తో రెబల్ స్టార్ నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ ప్రాజెక్టులు పట్టాల మీదున్నాయి. సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ ను కూడా గతంలోనే ఒకే చేశాడు. తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్టు గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో డార్లింగ్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

Siddharth-Anand.jpg

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) ఒకరు. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ చిత్రాలతో ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని అతడికీ పేరుంది. సిద్దార్థ్, ప్రభాస్ కలసి సినిమా చేస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ రూమర్సే నిజమయ్యాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించనుంది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ అధినేత నవీన్ యెర్నేని తాజాగా తెలిపారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టులున్నాయి. ఈ సినిమాలన్ని పూర్తయిన తర్వాత 2024లో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. సిద్దార్థ్ ఆనంద్ తాజాగా ‘పఠాన్’ కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల కానుంది. హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో రూపొందినవే. ప్రభాస్ మూవీ కూడా అటువంటి స్క్రిఫ్ట్‌తోనే రూపొందనుందని తెలుస్తోంది.

Updated Date - 2023-01-14T18:18:10+05:30 IST