Mahesh Babu: సూపర్ స్టార్ గురించి పవర్ స్టార్ ఏమి చెప్పారో తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2023-08-09T12:09:44+05:30 IST

ఈమధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటులు ఒకరి గురించి ఇంకొకరు బాగా మాట్లాడుకుంటున్నారు. అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే అగ్ర నటుల అభిమానులు ఎప్పుడూ సాంఘీక మాధ్యమాల్లో దూషించుకుంటూ ఉండటంతో, ఇలా మా మధ్య అంతా బాగుంటుంది, మీరే ఆలా దూషించుకుంటూ వుంటారు అని వాళ్ళకి సందేశం ఇచ్చినట్టే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తనిఖీ ప్రత్యేకంగా శుభాకాంక్షురాలు చెప్పడం అభిమానుల్లో ఆనందం నింపింది అని అంటున్నారు.

Mahesh Babu: సూపర్ స్టార్ గురించి పవర్ స్టార్ ఏమి చెప్పారో తెలిస్తే షాకవుతారు
Pawan Kalyan and Mahesh Babu

ఆగష్టు 9, (August9) ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) పుట్టినరోజు. మామూలుగా అగ్ర నటుల పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. అందులోకి మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) గారి అబ్బాయి, అంటే అతనికి అభిమానులు ఇంకా ఎక్కువ వుంటారు, ఈ పండగని ఇంకా పెద్దగా చేసుకుంటూ వుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు లండన్ లో చేసుకుంటున్నాడు, అతని అభిమానులు మాత్రం తెలుగు రాష్ట్రాలతో సహా ప్రపంచంలో ప్రతి దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు.

అలాగే పరిశ్రమ నుండి కూడా చాలామంది అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ వుంటారు. అయితే ఈ సంవత్సరం ఒక సర్ ప్రైజ్ కూడా వుంది, అదేంటి అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(PowerStar PawanKalyan), మహేష్ బాబుకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, అతని సినిమాలు ఏ విధంగా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డాయి, తన తండ్రి కృష్ణ గారిలా మహేష్ కూడా విభిన్న పాత్రలను పోషిస్తూ అభినయ సామర్ధ్యం చూపిస్తున్న మహేష్ కి శుభాకాంక్షలు అని చెప్పారు పవన్ కళ్యాణ్.

maheshbabupawankalyan1.jpg

"తెలుగు చిత్ర సీమలో తనదైన పంధా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణగారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్ధ్యం అయన సొంతం. సోదర సమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను," అని పవన్ కళ్యాణ్ చెప్పారు మహేష్ బాబు గురించి.

ఇలా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షురాలు చెప్పడం వలన అభిమానులకి ఒక సందేశం కూడా పంపుతున్నారు. పరిశ్రమలో మేమందరం ఒకటే, అభిమానులు లారా కొట్టుకోకండి, ఒకరిని ఒకరు తక్కువచేసి సాంఘీక మాధ్యమాల్లో మాట్లాడుకోకండి, అందరం ఒకటే అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ శుభాకాంక్షలతో చెప్పారు. ప్రొఫెషనల్ గా మాత్రమే తమ మధ్య పోటీ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ 'బ్రో' #BroTheAvatar ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పకనే చెప్పారు. మహేష్ బాబు ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) తో 'గుంటూరు కారం' #GunturKaram అనే సినిమా చేస్తున్నారు.

Updated Date - 2023-08-09T12:09:44+05:30 IST