Posani Krishna: ఏఐజీలో చేరిన పోసాని!

ABN , First Publish Date - 2023-04-14T09:50:41+05:30 IST

నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణ ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాదపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

Posani Krishna: ఏఐజీలో  చేరిన పోసాని!

నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణ (Posani krishna murali) ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాదపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. పోసానికి కరోనా (Corona Virus) సోకిందని వైద్యులు తెలిపారు. సినిమా షూటింగ్‌ కోసం పుణె వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. దగ్గు, జలుబుతోపాటు కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్‌ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. గతంలో కూడా పోసాని కృష్ణమురళీకి సోకిన సంగతి తెలిసిందే! ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. Posani Hospitalized)

ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తాజాగా ఓ వేదికపై నంది అవార్డులపై కామెంట్స్‌ చేశారు. గతంలో ఇచ్చిన నంది అవార్డులను కులాల పేరుతో పంచుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇచ్చే ఆలోచన ఉంటే ప్రతిభ గల వారికే ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే! పోసాని చేసిన వ్యాఖ్యలకు ప్రసన్నకుమార్‌, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు కౌంటర్‌ ఇచ్చారు.

Updated Date - 2023-04-14T11:05:17+05:30 IST