AnasuyaBharadwaj: పైకెక్కి కూర్చొని ఏమి చేసిందో చూడండి !

ABN , First Publish Date - 2023-03-15T11:32:50+05:30 IST

ముక్కు సూటిగా, మొహమాటం లేకుండా మాట్లాడే అనసూయ ఈసారి తన ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి గ్లామర్ పిక్చర్స్ పోస్ట్ చేసిందో చూడండి

AnasuyaBharadwaj: పైకెక్కి కూర్చొని ఏమి చేసిందో చూడండి !

ప్రముఖ యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) ఇటు టీవీ లోనూ అటు వెండి తెర మీదా బాగా పాపులర్ అయినా నటి, యాంకర్. అనసూయ ఎటువంటి విషయాన్నీ అయినా కుండబద్ధలు కొట్టి చెప్పే వ్యక్తి. మొహమాటం ఉండదు, ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి కూడా. అటువంటి అనసూయ అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటుంది, వివాదాల్లో కూడా ఉంటుంది. సాంఘీక మాధ్యమాల్లో అప్పుడప్పుడూ ఈమెని నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. అటు ట్విట్టర్ లో, ఇటు ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో కూడా ఒక్కోదగ్గర 1.2 మిలియన్ ఫాలోవర్స్ (1.2 million) వున్న అనసూయకి రోజు రోజుకీ చాలా పాపులారిటీ పెరుగుతోంది అనడం లో సందేహం లేదు.

anasuyabharadwaj4.jpg

ఈమధ్య సినిమాలు కూడా బాగానే చేస్తోంది, అలాగే టీవీ లో కేవలం తనకి నచ్చిన ప్రోగ్రామ్స్ కి మాత్రమే యాంకరింగ్ చేస్తోంది. అప్పట్లో 'జబర్దస్త్' (#Jabardasth) కామెడీ షో కి యాంకరింగ్ చేసిన అనసూయ ఆ షో కి ఆమె గ్లామర్ ని కూడా తీసుకు వచ్చింది. అంతలా పాపులర్ అయింది ఆమె.

anasuyabharadwaj3.jpg

ఈమధ్యనే ఆమె చేసిన సినిమా 'అరి' (Ari) ట్రైలర్ కూడా విడుదల అయింది. అందులో అనసూయ ఒక వైవిధ్యం అయిన పాత్ర పోషిస్తోంది అనటం లో సందేహం లేదు. ఈ ట్రైలర్ చూస్తే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని, ఇందులో సూపర్ నేచురల్ సన్నివేశాలు కూడా వుంటాయని అర్థం అవుతోంది. చాలా ఆసక్తికరంగా వుంది ఈ సినిమా.

anasuyabharadwaj2.jpg

అలాగే 'ఫ్లాష్ బ్యాక్' (Flashback) అనే తమిళ సినిమాలో కూడా చేస్తోంది. ఇందులో కూడా ఇంకో వైవిధ్యం అయిన పాత్ర పోషిస్తోంది అని అనిపిస్తోంది. అలాగే ఈ సినిమాతో అనసూయ తమిళ సినిమాల్లో కూడా పాపులర్ అవుతుందని, ఇంకా మరిన్ని తమిళ సినిమాలు చేస్తుందని కూడా అనిపిస్తోంది. ప్రభు దేవా (Prabhu Deva), రెజినా కాసాండ్రా (Regina Cassandra) ఇందులో లీడ్ పెయిర్ గా చేస్తున్నారు.

విడుదల సిద్ధంగా వున్న తెలుగు సినిమా 'రంగ మార్తాండ' (Rangamarthanda). ఇందులో అనసూయ ఒక స్పైసీ పాత్రలో కనిపించనుంది అని ఈ సినిమా మొదలు పెట్టినప్పుడే దర్శకుడు కృష్ణ వంశి (Krishna Vamsi) చెప్పాడు. అలాగే అనసూయ కూడా దర్శకుడు కృష్ణ వంశీ తో పని చెయ్యటం తన కల అని చెప్పింది. ఎందుకంటే కృష్ణ వంశీ సినిమాల్లో అమ్మాయిల పాత్రలు చాలా బలంగా చూపెడతాడని, అలాగే అతని సినిమాల వలన చాల స్ఫూర్తి పొందానని చెప్పింది అనసూయ. ఈ సినిమా విడుదల సిద్ధంగా వుంది, ఇందులో అందరూ అనసూయ ఎలా వుండబోతోందా అని ఎదురు చూస్తున్నారు.

anasuyabharadwaj1.jpg

అలాగే ఇప్పుడు చేస్తున్న ఇంకొక సినిమా 'పుష్ప 2' (Pushpa 2). ఈ రెండో పార్టులో అనసూయ పాత్రని దర్శకుడు సుకుమార్ (Sukumar) బాగా రాసాడని, ఆమెని మొదటి పార్టు లో కన్నా ఈ రెండో పార్టులో విలన్ గా బాగా చూపిస్తాడని అనుకుంటున్నారు. మొదటి పార్టులో అనసూయ పాత్రకి చాలామంది కితాబులు ఇచ్చారు. ఇది ప్రపంచం అందరూ ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి, అనసూయ ఈ సినిమాతో మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది అనటం లో సందేహం లేదు.

anasuyabharadwaj.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనసూయ తన సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ తన పిక్స్, కుటుంబం తో వున్నవి షేర్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక్కోసారి తన బోల్డ్ ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈసారి కూడా అలానే షేర్ చేసింది. అయితే ఆమె ఫోటోస్ చూసి మళ్ళీ ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్స్ అందరూ ఆమె ఫోటోస్ మీద విపరీతమయిన కామెంట్స్ పెట్టారు.

Updated Date - 2023-03-15T11:32:52+05:30 IST