Poonam Kaur: ముంబై అమ్మాయిలే కావాలా?

ABN , First Publish Date - 2023-03-16T17:26:30+05:30 IST

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు నటి పూనమ్‌కౌర్‌ తరచూ వార్తలో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచారు.

Poonam Kaur: ముంబై అమ్మాయిలే కావాలా?

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు నటి పూనమ్‌కౌర్‌ (poonam kaur) తరచూ వార్తలో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచారు. తనకు చిత్ర పరిశ్రమలో పని చేయాలనుందని, కానీ ఇక్కడ రాణించకుండా తెలుగు వారిని తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ‘‘నాకు సినిమా ఇండస్ట్రీలో పని చేయానుంది. కానీ మేకర్స్‌ తమకు ఇష్టమైన హీరోయిన్‌లనే తమ సినిమాలకు ఎంపిక (poonam kaur comments on TFI) చేసుకుంటున్నారు. ముంబై నుంచి వచ్చిన అమ్మాయిల్లోనే యాక్టింగ్‌ టాలెంట్‌ ఉందా? తెలుగువారిలో లేదా? ఏ వేదిక మీదైనా తెలుగు కథానాయిక అంటే సావిత్రమ్మ పేరు చెబుతారు కదా! ఇప్పుడు ఎందుకు తెలుగు బిడ్డ, తెలుగు ఆర్టిస్ట్‌ అనే గౌరవం తగ్గిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న తెలుగు అమ్మాయిలను ఎదగనివ్వడం లేదు. ఎంకరేజ్‌ చేయడం లేదు. నా నేపథ్యం పంజాబ్‌ సిక్కు ఫ్యామిలీ అయినా నేను తెలంగాణాలోనే పుట్టి పెరిగాను.. ఇక్కడే చదివాను. దయచేసి నన్ను వేరు చేసి చూడకండి’’ అని అన్నారు. Poonam kaur Setire on Mumbai heroines)

Updated Date - 2023-03-16T18:33:33+05:30 IST