Pooja Hegde- Guntur Karam: తీసుకున్న అడ్వాన్స్‌ కోసం ఓకే అనేసింది!

ABN , First Publish Date - 2023-07-18T16:55:54+05:30 IST

మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ లో చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. మెయిన్‌ హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయిన పూజాహెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను మెయిన్‌ హీరోయిన్‌ని చేశారు. మరో నాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోకి పూజా మళ్లీ వచ్చిందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

Pooja Hegde- Guntur Karam: తీసుకున్న అడ్వాన్స్‌ కోసం ఓకే అనేసింది!

మహేశ్‌ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Karam) లో చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. మెయిన్‌ హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయిన పూజాహెగ్డే (Pooja hegde) ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను మెయిన్‌ హీరోయిన్‌ని చేశారు. మరో నాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోకి పూజా మళ్లీ వచ్చిందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ‘గుంటూరు కారం’ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌కు ఆస్కారం ఉంది. ఈ పాటలో పూజాహెగ్డే ఆడిపాడటానికి ఖాయమైనట్లు తెలిసింది. సినిమా నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా ఈ సినిమాలో భాగం కావడానికి కారణం ఉంది. ఈ సినిమాకు సైన్‌ చేసినప్పుడు ఆమె తీసుకున్న అడ్వాన్స్‌. సినిమా నుంచి బయటకు వెళ్లిన సమయంలో అడ్వాన్స్‌ ఆమె దగ్గరే ఉండిపోయింది. ఆ అడ్వాన్స్‌ బ్యాలెన్స్‌ క్లియర్‌ చేయడానికి మళ్లీ పూజా హెగ్డేను ఐటెం సాంగ్‌ కోసం సంప్రదించారని సమాచారం. ఇదంతా గురుజీ ప్లాన్‌ అని చెబుతున్నారు. (Pooja hegde item song for guntur karam)

అసలు ఈ చిత్రం నుంచి పూజా బయటకు వెళ్లడానికి కారణం యూనిట్‌కి, ఆమెకు మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు కారణమని టాక్‌. ఇప్పుడు మళ్ళీ సినిమాలో భాగం కావాల్సివచ్చింది. పూజా కూడా తెలివిగానే అలోచించింది. రెండు రోజులు కాల్షీట్లు అడ్జస్ట్‌ చేస్తే అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు పూజా ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకే యూనిట్‌తో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఐటమ్‌ సాంగ్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మహేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ పూర్తయ్యాక మహేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కు వెళ్లబోతున్నారని తెలిసింది. ఆగస్ట్‌ రెండోవారంలో ఆయన ఇండియాకు తిరిగొస్తారని ఆయన ఫ్యాన్స్‌ పేజీల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Updated Date - 2023-07-18T16:55:54+05:30 IST