scorecardresearch

AishwaryaRaiBachchan: ప్రెస్ మీట్ లో సడన్ గా ఐశ్వర్య ఏమి చేసిందో చూస్తే షాక్ అవుతారు, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-04-26T12:02:28+05:30 IST

ముంబై లో దర్శకుడు మణిరత్నం సినిమా 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా ప్రచారం సందర్బంగా జరిగిన ఒక సంఘటనలో ఐశ్వర్య రాయి చేసిన పని వైరల్ గా మారింది

AishwaryaRaiBachchan: ప్రెస్ మీట్ లో సడన్ గా ఐశ్వర్య ఏమి చేసిందో చూస్తే షాక్ అవుతారు, ఫోటోస్ వైరల్
Mani Ratnam and Aishwarya Rai

దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) అంటే ఎంతోమంది నటీనటులకు ఒక గురవం, భక్తి, గురువు కూడా. మణిరత్నం సినిమాలు అంటే ఎదురుచూసే ప్రేక్షకులు కోకొల్లలు వున్నారు. అతని సినిమా వస్తోంది అంటే చాలు, అవార్డులు కూడా వచ్చేస్తాయి వాటికి. అంతటి ప్రభావం వుంది మణిరత్నం అంటే భారతదేశం లో. ఎంతమంది దర్శకులకు కూడా అతను స్ఫూర్తి కూడా.

aishwaryaraimaniratnam.jpg

ఇప్పుడు మణిరత్నం చారిత్రాత్మక సినిమా 'పొన్నియన్ సెల్వన్' (Ponniyan Selvan) సినిమాతో వస్తున్నాడు. ఇది మొదటి పార్టు విడుదల అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు రెండో పార్టు ఈ వారం విడుదల అవుతోంది. ఇందులో చాలామంది నటీనటులు ఐశ్వర్య రాయి (Aishwarya Rai Bachchan) , త్రిష (Trisha), విక్రమ్ (Vikram), కార్తీ (Kaarthi), జయం రవి (Jayam Ravi), ప్రకాష్ రాజ్ (Prakash Raj), శరత్ కుమార్ (Sarath Kumar) ఇలా చాలామంది దిగ్గజాలు వున్నారు.

aishwaryarai1.jpg

ఈ సినిమా ప్రచారం కూడా విస్తృతంగానే చేస్తున్నారు. ఆమధ్య చెన్నై లో, తరువాత హైదరాబాద్ లో, మొన్న ముంబై లో ఇలా ఈ చిత్ర ప్రచారాలు నిర్వహించారు. అన్ని ఈవెంట్స్ కి చాలామంది నటీనటులు వచ్చారు. త్రిష, ఐశ్వర్య, విక్రమ్, కార్తీ, జయం రవి అందరూ వచ్చారు. అయితే ముంబై లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది వైరల్ గా కూడా మారింది.

aishwaryarai2.jpg

ఈ 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో నందిని పాత్రకి వేరే ఎవరినీ అనుకోలేదు అనీ, ఆ పాత్రకి కేవలం ఐశ్వర్య రాయి ని అనుకొని ఆమె దగ్గరికి వెళితే ఆమె వెంటనే ఒప్పుకుందని, దర్శకుడు మణిరత్నం చెపుతూ ఐశ్వర్య ప్రతిభని కూడా మెచ్చుకున్నాడు. ఇలా చెపుతున్నప్పుడు అక్కడ పక్కనే ఇంకో కుర్చీలో కూర్చున్న ఐశ్వర్య వెంటనే వచ్చి మణిరత్నం పాదాలకి నమస్కరించింది. ఈ హఠాత్పరిణామానికి మణిరత్నం తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలుచున్నాడు.

aishwaryarai.jpg

వెంటనే ఐశ్వర్య తన గురువు అయిన మణిరత్నంని మనసారా కౌగిలించుకొని తన గౌరవాన్ని చాటింది. ఐశ్వర్య ఎప్పుడూ మని రత్నం తన గురువు అనే సంభోదిస్తుంది. అందుకే అతను అంటే అంత గౌరవం ఐశ్వర్య కి. ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో ఈ ఫోటోస్ వైరల్ గా మారాయి.

Updated Date - 2023-04-26T12:02:28+05:30 IST