Pindam Teaser : ఆసక్తికరంగా పిండం టీజర్‌

ABN , First Publish Date - 2023-10-30T14:50:44+05:30 IST

శ్రీకాంత్‌ శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘పిండం’. సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అవసరాల శ్రీనివాస్‌, ఈశ్వరీ రావు, రవివర్మ కీలక పాత్రధారులు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

Pindam Teaser : ఆసక్తికరంగా పిండం టీజర్‌

శ్రీకాంత్‌ శ్రీరామ్‌(Sriram), ఖుషీ రవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘పిండం’(Pindam). సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అవసరాల శ్రీనివాస్‌, ఈశ్వరీ రావు, రవివర్మ కీలక పాత్రధారులు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం’ అనే ట్యాగ్‌లైన్‌తో టీజర్‌ రిలీజ్‌ చేశారు. దీన్ని బట్టి చూేస్త ఓ ఆత్మ చూట్టూ తిరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా చూపించనున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు విన్న ఓ కథను హారర్‌ జోనర్‌లో తెరకెక్కించాలని అనిపించింది. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా టైటిల్‌ ‘పిండం’ అని చెప్పగానే అలాంటి పేరు ఎందుకు పెట్టావని అందరూ అన్నారు. మొదటి సినిమానే ఇలాంటిది ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. ఆ టైటిల్‌ నెగటివ్‌ అని అంతా అనుకున్నారు. కానీ పిండం అంటే ఆరంభం, అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టాను. సినిమా చూశాక ఈ టైటిల్‌ కరెక్ట్‌ అని అందరూ అనుకుంటారు.

Updated Date - 2023-10-30T14:50:44+05:30 IST