Phalana Abbayi Phalana Ammayi: ఫస్ట్ లుక్ వదిలారు

ABN , First Publish Date - 2023-01-02T16:29:58+05:30 IST

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) దర్శకత్వం..

Phalana Abbayi Phalana Ammayi: ఫస్ట్ లుక్ వదిలారు
Phalana Abbayi Phalana Ammayi First Look

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య (Naga Shaurya), మాళవిక నాయర్ (Malvika Nair) ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన సంవత్సరానికి వెల్‌కమ్ పలుకుతూ.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. పోస్టర్‌లో అందమైన వస్త్రధారణతో, అంతకంటే అందంగా ఉన్న ఆ జంటను చూస్తుంటే.. ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అనేది అర్థమవుతోంది. ఈ ఫస్ట్ లుక్‌.. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Phalana Abbayi Phalana Ammayi First Look)

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించబోతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెలిపారు. శ్రీనివాస్ అవసరాల సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade), ‘జ్యో అచ్యుతానంద’ (Jyo Achyutananda) అనే చిత్రాలు చేశారు. వారికి ఇది హ్యాట్రిక్ చిత్రం. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విషయానికి వస్తే.. 2022లో ఈ బ్యానర్‌లో వచ్చిన ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కాగా.. గతంలో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు సంగీతం అందించిన కళ్యాణి మాలిక్.. ఈ ‘ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి’కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Updated Date - 2023-01-02T16:30:11+05:30 IST