Petition on Adipurush: ఇది నాగరికతను అవమానించడమే..

ABN , First Publish Date - 2023-06-17T13:33:40+05:30 IST

ప్రభాస్‌ (Prabhas)రాఘవుడిగా ఓం రౌత్‌ (om Raut) Aదర్శకత్వం వహించి ‘ఆదిపురుష్‌' (Adipurush)’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ ఉన్నప్పటికీ చక్కని కలెక్షన్లు రాబడుతోంది. అయితే తొలి ఆట నుంచి సినిమాపై వ్యతిరేకత మొదలైంది.

Petition on Adipurush: ఇది నాగరికతను అవమానించడమే..

ప్రభాస్‌ (Prabhas)రాఘవుడిగా ఓం రౌత్‌ (om Raut) Aదర్శకత్వం వహించి ‘ఆదిపురుష్‌' (Adipurush)’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ ఉన్నప్పటికీ చక్కని కలెక్షన్లు రాబడుతోంది. అయితే తొలి ఆట నుంచి సినిమాపై వ్యతిరేకత మొదలైంది. హిందువుల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బ తీసేలా ఈ చిత్రం తెరకెక్కిందని హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. వాల్మీకి, తులసీదాస్‌ రచించిన రామాయణంలోని పాత్రలకు విరుద్థంగా ‘ఆదిపురుష్‌’ చిత్రంలోని ప్రధాన పాత్రలను అనుచిత రీతిలో తెరకెక్కించారని పిటీషన్‌లో పేర్కొన్నారు. (petition on adipurush)

‘‘హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇందులో పాత్రలున్నాయి. దేవతామూర్తుల వర్ణన, చిత్రీకరణ సరైన రీతిలో లేదు. హిందూ బ్రాహ్మణుడైన రావణ పాత్రధారి గడ్డంతో కన్పించడం అభ్యంతరకరంగా ఉంది. ఇది హిందూ నాగరికతను అవమానించడమే. రావణుడికి సంబంధించిన సన్నివేశాలను వాస్తవాలకు దూరంగా తెరకెక్కించారు. సినిమాలో దేవుళ్లకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను సరిదిద్దడం లేదా తొలగించడం చేయాలి. లేదంటే సినిమా ప్రదర్శన నిలిపివేయాలి’’అని విష్ణు గుప్తా తన పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రానికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. టీజర్‌ విడుదల సమయంలో రాముడు, రావణుడు, హనుమంతుడ పాత్రలను చూపించిన విధానం బాగోలేదని పలు సంఘాలు, అభిమానులు మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో విజువల్స్‌, చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంపై మరో పిటిషన్‌ దాఖలు కావడంతో చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-06-17T13:33:40+05:30 IST