పాయల్ పాత్ర వెంటాడుతుంది
ABN , First Publish Date - 2023-04-25T23:22:30+05:30 IST
‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రం తర్వాత దర్శకుడు అజయ్‌భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కలయికలో వస్తున్న చిత్రం ‘మంగళవారం’. స్వాతి గునుపాటి, సురేశ్ వర్మ ఎం.లతో కలసి ఆయన నిర్మిస్తున్నారు.

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రం తర్వాత దర్శకుడు అజయ్‌భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కలయికలో వస్తున్న చిత్రం ‘మంగళవారం’. స్వాతి గునుపాటి, సురేశ్ వర్మ ఎం.లతో కలసి ఆయన నిర్మిస్తున్నారు. పలు దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జడలో పూలు, వేలిపై సీతాకోకచిలుకతో ఒంటిపై ఆచ్ఛాదన లేకుండా పాయల్ కనిపించారు. ఈ చిత్రంలో ఆమె శైలజ అనే యువతి పాత్రను పోషిస్తున్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా పాయల్ పాత్ర వెంటాడుతుంది’ అన్నారు. ఇప్పటికి 75 రోజుల పాటు చిత్రీకరణ చేశాం, వచ్చే నెలలో చివరి షెడ్యూల్ ప్రారంభిస్తాం అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోకనాథ్. సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర