Pawan kalyan OG Glimpse: అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే.

ABN , First Publish Date - 2023-09-02T11:14:43+05:30 IST

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజి’(OG). సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. నేడు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘హంగ్రీ చీతా’ పేరుతో మేకర్స్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు

Pawan kalyan OG Glimpse: అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే.

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజి’(OG). సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. నేడు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘హంగ్రీ చీతా’ (Hungry Cheeta) పేరుతో మేకర్స్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అర్జున్‌ దాస్‌ వాయిస్‌తో మొదలైన ఈ గ్లింప్స్‌ పవర్‌ఫుల్‌గా ఉంది.

Untitled-3.jpg

పవన్‌కల్యాణ్‌ ఎలివేషన్స్‌ చూస్తుంటే రోమాలు నిక్కబోడిచేలా ఉన్నాయి. ఎప్పటిలాగే పవన్‌కల్యాణ్‌ లుక్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేలా ఉన్నాయి. ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ఇమ్రన్‌ హస్మీ, అర్జున్‌ దాస్‌, శ్రేయారెడ్డి, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్‌ ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి! (OG Glimpse)

‘‘వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది..

అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. సాలా.. షేక్‌.. షివర్‌ ఆ జాయేగా’’ అంటూ అర్జున్‌ దాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది.

‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత.

చూపుగాని విసిరితే ఒర కంట

డెత్‌ కోట కన్ఫమ్‌ అంట...

ఎవరికీ అందనిది అతని రేంజ్‌’’

అంటూ బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అదిరిపోయేలా ఉంది. తమన్‌ అందించిన సంగీతం గూస్‌ బంప్స్‌ ఖాయం అనేలా ఉంది. ఫస్ట్‌ లుక్‌.. లాంటివి ఏమీ లేకుండా హంగ్రీ చీతా పేరుతో ప్రేక్షకులకు మాస్‌ ట్రీట్‌ ఇచ్చారు ‘ఓజి’ మేకర్స్‌

Updated Date - 2023-09-02T11:43:59+05:30 IST