సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hbd RamCharan: పవన్‌కల్యాణ్‌ అభిలాష!

ABN, First Publish Date - 2023-03-27T14:34:46+05:30

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు చరణ్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Global star Ram charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు చరణ్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులు అయితే చిరంజీవి (Chiranjeevi) బ్లడ్‌బ్యాంక్‌, చరణ్‌ ఇంటి దగ్గర సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan wishes) చెర్రీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్‌చరణ్‌కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్‌ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలి అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్‌కి ఉన్న క్రమశిక్షణ వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగరవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ (Ram charan)అలరించిన సంగతి తెలిసిందే! ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయినది మొదలు.. అమెరికాలో ప్రమోషన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఆస్కార్‌ అవార్డు అందుకోవడానికి నెల రోజుల ముందు నుంచే అమెరికాలో ఫ్యాన్స్‌ మీట్‌, అక్కడి పాపులర్‌ టీవీ షోలు, గుడ్‌ మార్నింగ్‌ అమెరికా లాంటి టాక్‌ షోలో పాల్గొన సందడి చేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం టైటిల్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. (Happy birthday Ram charan)

Updated Date - 2023-03-27T14:47:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!