Bro: అసలే ఎండాకాలం.. ఇంకా హీట్‌ పెంచుతున్నావ్‌ అన్నా!

ABN , First Publish Date - 2023-05-21T12:32:48+05:30 IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) మంచి ఊపు మీదున్నారు. వరుస చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు చిత్రాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

Bro: అసలే ఎండాకాలం.. ఇంకా హీట్‌ పెంచుతున్నావ్‌ అన్నా!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) మంచి ఊపు మీదున్నారు. వరుస చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు చిత్రాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏడాదికి ఒక సినిమాతో సరిపెట్టే పవన్‌ ఈ ఏడాది నాలుగు చిత్రాల అప్‌డేట్‌లతో అభిమానులు ఊపిరి పీల్చుకునే గ్యాప్‌ లేకుండా చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ నుంచి ఒక న్యూస్‌ వస్తే.. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’తో ఇంకో అప్‌డేట్‌ వస్తుంది. మూడో రోజు ‘బ్రో’ (Bro)తో మరో రోజు ‘ఓజీ’(OG) ఇలా అప్‌డేట్‌లతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. దీంతో పవన్‌ ఫ్యాన్‌లో పండగ వాతావరణం నెలకొంది.

‘హరిహర వీరమల్లు’ (hariHara Veeramallu) క్లైమాక్స్‌లో ఉంది. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ఒక షెడ్యూల్‌ పూర్తయింది. ‘ఓజీ’ ముంబైలో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తాజాగా పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ షూటింగ్‌లో అడుగుపెట్టారు. పవన్‌ సెట్‌కు రావడం దగ్గరనుంచి షూటింగ్‌ మొదలు పెట్టేవరకు వీడియో తీసి మేకర్స్‌ అబిమానుల కోసం సోషల్‌ మీడియాలో వదిలారు. పెద్ద కారులో సింపుల్‌ కుర్తా ఫైజామాతో దిగారు పవన్‌. ఆయనను రిసీవ్‌ చేసుకోవడానికి డైరెక్టర్‌, ప్రొడ్యూసర్స్‌ రావడం.. సెట్‌లో సన్నివేశాల గురించి చర్చించుకోవడం లాంటివి చూపించారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ సహా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లా సమక్షంలో పవన్‌కి ఒక సన్నివేశాన్ని వివరిస్తూ ఫోటోకి కూడా పోజులిచ్చారు. ఈ వీడియోను మేకర్స్‌ పోస్ట్‌ చేస్తూ.. ’’ మన బ్రో.. పవన్‌ కళ్యాణ్‌.. సెట్స్‌ లోకి అడుగుపెట్టి.. వాతావరణాన్ని మరింత హీట్‌ అయ్యేలా చేశారు’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘అసలే ఎండాకాలం.. నీ లుక్స్‌ తో మరింత హీట్‌ పెంచుతున్నావ్‌ అన్నా’ అంటూ అభిమానులు పోస్ట్‌లు చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Untitled-1.jpg

Updated Date - 2023-05-21T12:42:17+05:30 IST