Pawan Kalyan: కుటుంబంతో హాలిడే కి వెళ్లిన జనసేన నేత

ABN , First Publish Date - 2023-04-01T13:27:21+05:30 IST

జన సేన పార్టీ నేత, నటుడు పవన్ కళ్యాణ్, సినిమాలకి, రాజకీయాలకి కొంచెం బ్రేక్ ఇచ్చి, కుటుంబంతో కొంత కాలం గడపాలని వెకేషన్ ని వెళ్ళాడు.

Pawan Kalyan: కుటుంబంతో హాలిడే కి వెళ్లిన జనసేన నేత
Pawan Kalyan

ఎండాకాలం మొదలయింది, ఎండలు మండిపోతున్నాయి అప్పుడే. మరి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ ఎండలకు షూటింగ్ కి సెలవులు ఇచ్చేసి హాలిడేస్ తీసుకుంటున్నారు. నటుడు, రాజకీయ నేత అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు చిన్న వెకేషన్ కి వెళ్లారు. కుటుంబంతో సలహా ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తారు అని తెలిసింది. అందుకే దర్శకుడు సముద్రఖని (Smuthirakani) సినిమా తొందరగా, కంటిన్యూ గా షూటింగ్ చేసి పూర్తి చేసేసాడు పవన్ కళ్యాణ్.

Pawan-kd.jpg

వెకేషన్ నుండి తిరిగి వచ్చి క్రిష్ (Director Krish) దర్శకత్వం లో వస్తున్న 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) మొదలెట్టవచ్చు అని కూడా తెలిసింది. అలాగే దర్శకుడు సుజీత్ (Sujeeth) తో చేస్తున్న సినిమా కూడా షూటింగ్ మొదలెట్టొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఈ రెండు సినిమాలు ముందు పూర్తి చేసాక తరువాత దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagath Singh) మొదలెట్టొచ్చు అన్న యోచనలో పవన్ కళ్యాణ్ వున్నదని తెలుస్తోంది.

pawan.jpg

ఈలోగా మళ్ళీ ఏదైనా రాజకీయ సంఘటనలు ఉంటే కనక మధ్యలో అటువైపు కూడా వెళ్లే ఆలోచనలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఈ సంవత్సరం చివర లోగా పూర్తి చెయ్యాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలంగాణతో సమానంగా ముందస్తు ఎన్నికలు రావొచ్చు అని ఊహాగానాలు వస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతగా (Jana Sena Party) రాజకీయంగా బిజీ అయిపోతాడు. అందుకే తొందరగా ఈ సినిమాలు పూర్తి చెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలిసినిది.

Updated Date - 2023-04-01T13:27:22+05:30 IST