కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OG - Pawan kalyan : పవన్‌ కనిపించేది ఎంత సేపంటే...

ABN, First Publish Date - 2023-09-11T16:03:42+05:30

పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చి త్రం ‘ఓజీ’ ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’ (Og) ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ ఎంట్రీ సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత ఎంట్రీ ఇస్తారని, అక్కడి నుంచి సినిమా మొత్తంలో దాదాపు గంట నిడివి కనిపిస్తారని నెట్టింట వైరల్‌ అవుతోంది. అధికారికంగా మేకర్స్‌ ప్రకటించలేదు కానీ ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోందని వినికిడి. అయితే పార్ట్‌ 1 ప్రీ క్లైమాక్స్‌ సీక్వెల్‌కి లీడ్‌ అదిరిపోయేలా దర్శకుడు డిజైన్‌ చేశాడట. పార్టు 2 లో ప్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఈ రెండు వార్తలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా హంగ్రీ చీతా పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌ సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించింది. ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రన్‌ హస్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియారెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌, హరీశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-11T16:07:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!