Pawan kalyan -OG : మూడో షెడ్యూల్‌ పూర్తి.. తదుపరి ఏంటంటే

ABN , First Publish Date - 2023-06-26T12:33:37+05:30 IST

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) కీలక పాత్రలో సుజీత్‌ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓజి’ (OG) (వర్కింగ్‌ టైటిల్‌). శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌ వారాహి విజయ యాత్రలో(Vaarahi Vijaya Yatra) ఉన్నప్పటికీ ఆయన లేని సన్నివేశాలను, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Pawan kalyan -OG : మూడో షెడ్యూల్‌ పూర్తి.. తదుపరి ఏంటంటే

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) కీలక పాత్రలో సుజీత్‌ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓజి’ (OG) (వర్కింగ్‌ టైటిల్‌). శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌ వారాహి విజయ యాత్రలో(Vaarahi Vijaya Yatra) ఉన్నప్పటికీ ఆయన లేని సన్నివేశాలను, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన మూడో షెడ్యూల్‌ ఆదివారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ‘దీనితో 50 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయింది. రానున్న రోజులు మరింత ఎగ్జైటింగ్‌గా ఉండబోతున్నాయి’ అంటూ టీమ్‌ అంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. (Third Schedule Completed)

గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్‌ స్టైలిష్‌ మేకింగ్‌తో రూపొందిస్తున్నారు. పాత్రల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రియారెడ్డి, అర్జున్‌ దాస్‌, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హస్మీ, హరీశ్‌ ఉత్తమన్‌ ఇలా భారీ బృందంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు డి.వి.వి.దానయ్య. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌ ప్రేక్షకులకు తెలియజేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. అంతే కాదు ఈ సినిమాలో పని చేస్తున్న కొందరు తారలు చెప్పుకొచ్చిన విషయాలు కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే నెలలో తదుపరి షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌ సరసన ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-06-26T12:33:37+05:30 IST