Pawan Kalyan-OG: లైట్స్‌.. కెమెరా.. కావలసినంత డ్రామా!

ABN , First Publish Date - 2023-07-11T18:05:17+05:30 IST

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ (OG) చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. నాలుగో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్వీట్‌ చేసింది.

Pawan Kalyan-OG: లైట్స్‌.. కెమెరా.. కావలసినంత డ్రామా!

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ (OG) చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. నాలుగో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్వీట్‌ చేసింది. దర్శకుడు సుజీత్‌, డిఓపీ రవి.కె.చంద్రన్‌ ఏదో చర్చించుకుంటున్న ఓ ఫొటో విడుదల చేసి ‘లైట్స్‌.. కెమెరా..లాట్‌ ఆప్‌ డ్రామా’ అని పోస్ట్‌ చేశారు(FireStormIsComing). ముఖ్య తారాగణం అంతా పాల్గొనగా నాలుగో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలు కానుంది. రానున్న నెలలు మరింత ఎగ్టైటింగ్‌గా మారునున్నాయి’’ అని రాసుకొచ్చారు. ఈ సినిమా ప్రారంభం నుంచి వరుస అప్‌డేట్‌లతో సినిమాపై అంచనాలు పెంచుతోంది చిత్రబృందం. తాజా అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వారాహి విజయ యాత్రం రెండో విడతతో బిజీగా ఉన్న పవనకల్యాణ్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారా లేదా అన్నది తెలియాలి. (TheyCallHimOG)


యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఇమ్రాన్‌ హస్మీ, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-07-11T18:05:17+05:30 IST