Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌ షెడ్యూల్‌ ఇదే!

ABN , First Publish Date - 2023-04-27T10:07:45+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawankalyan) అటు జనసేన పార్టీ కార్యక్రమాలతో, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. శరవేగంగా ఆయన నటిస్తున్న చిత్రాలు పూర్తి చేసే పనులో ఉన్నారు.

Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌ షెడ్యూల్‌ ఇదే!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawankalyan) అటు జనసేన పార్టీ కార్యక్రమాలతో, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. శరవేగంగా ఆయన నటిస్తున్న చిత్రాలు పూర్తి చేసే పనులో ఉన్నారు. వరుస షెడ్యూళ్లతో (Busy Schedules) బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’(Hariharaveeramallu), హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, (Ustaad bhagath singh)సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదాయ సిత్తం’, (PKSDT) సుజీత్‌ దర్శకత్వంలో ‘ఒజి’ (OG) చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలా అంగీకరించిన ప్రతి చిత్రానికి కాల్షీట్లు ఇస్తూ వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. ఆయన షెడ్యూల్‌ ఇలా ఉంది అంటూ ఫ్యాన్స్‌ పేజీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇటీవల ముంబైలో ‘ఒజి’ చిత్రీకరణలో పాల్గొన్న పవన్‌ల్యాణ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన ముంబైకి బయలుదేరతారు. అక్కడ ‘ఒజి’ షూటింగ్‌లో పాల్గొంటారు. అక్కడ మే ఆరో తేది వరకూ షెడ్యూల్‌ ఉంటుందట. ఆ షెడ్యూల్‌ పూర్తయ్యాక ..సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ‘పీకేఎస్‌డీటీ’ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇప్పటికే ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఓ పాట షూటింగ్‌ ఉందట. ఆ పాట కోసం పవన్‌ సెట్లో అడుగుపెడతారని చెబుతున్నారు. తదుపరి ‘హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్‌లో అడుగుపెడతారని టాక్‌ నడుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ రానుందని తెలుస్తోంది. జూన్‌ చివరి వారంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెట్లో పవన్‌ అడుగుపెడతారు. ప్రస్తుతానికి పవన్‌కల్యాణ్‌ షెడ్యూల్‌ ఇలా ఉందని పీకే ఫ్యాన్స్‌ పేజీల్లో ట్రెండ్‌ అవుతోంది.

Updated Date - 2023-04-27T10:07:45+05:30 IST