UstaadBhagathSingh: అందరికీ న్యాయం చేస్తున్న పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2023-04-15T13:15:12+05:30 IST

పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. సముద్రఖని సినిమా పూర్తి చేసాడు, హరీష్ శంకర్ తో మొదటి షెడ్యూల్ అయిపొయింది, సుజీత్ సినిమాకి వచ్చేవారం, అలాగే క్రిష్ సినిమా కూడా ఇలా అన్నిటికీ సమ న్యాయం చేస్తూ డేట్స్ కేటాయిస్తున్నాడు

UstaadBhagathSingh: అందరికీ న్యాయం చేస్తున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతి నిండా చాలా సినిమాలు వున్నాయి. అటు రాజకీయంగా కూడా చాలా బిజీ గా ఉంటాడు, అందుకని ఒప్పుకున్న సినిమాలకి తగు న్యాయం చెయ్యాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టినట్టున్నాడు. ఆమధ్య సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం లో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో చేస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ తన పాత్ర షూటింగ్ పూర్తి చేసాడు. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలన్స్ ఏమి లేదు.

ustaadbhagathsingh1.jpg

దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (UstadBhagathSingh) ఈమధ్య కాలం లో మొదలవ్వదు అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆ సినిమాకి ఒక 8 రోజుల పాటు డేట్స్ ఇచ్చి మొదటి షెడ్యూల్ పూర్తి చేసాడు. అందులో శ్రీలీల (Sreeleela) కథానాయకురాలు, ఆమె మీద పవన్ కళ్యాణ్ మీద కొన్ని సన్నివేశాలు, అలాగే కొన్ని పోరాట సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో ముగిసింది. ఇదే సమయంలో యాక్షన్ దర్శకులు రామ్-లక్ష్మణ్ (Ram Lakshman) పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.

Janasena-Pawan.jpg

అలాగే దర్శకుడు సుజీత్ తో (Sujeeth) 'ఓజి' (OG) సినిమా కి కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడని తెలిసింది. వచ్చే వారం ఆ సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందని తెలిసింది. ఇంకా దర్శకుడు క్రిష్ (Director Krish) సినిమా 'హరి హర వీరమల్లు' (HariHaraVeeramallu) కూడా పూర్తి చెయ్యాలి. వాళ్ళకి కూడా రానున్న రోజుల్లో కొన్ని డేట్స్ కేటాయించి ఆ సినిమాని కూడా పూర్తి చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని తెలిసింది.

రాజకీయంగా తను బిజీ అయ్యే సమయానికి ఈ సినిమాలనే ఒకటొక్కటి పూర్తి చేసి, ఎలెక్షన్ వచ్చే సమయానికి కొన్ని సినిమాలు విడుదల అయ్యేట్టు చూసుకుంటున్నట్టుగా భోగట్టా. ఇవే కాకుండా ఇంకా కొన్ని లైన్ అప్ లో ఉన్నాయని కూడా తెలుస్తోంది.

Updated Date - 2023-04-15T13:31:56+05:30 IST