Pawan Kalyan: ఇన్‌స్టా ఎంట్రీతో రికార్డే కాదు.. ఫస్ట్ ఫోస్ట్‌తో హీరోలందరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చాడు

ABN , First Publish Date - 2023-07-15T18:31:44+05:30 IST

జనసేనాని పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్‌ (instagram First post) చేశారు. ఈ నెల నాలుగో తేదిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరచిన ఆయన ఎలాంటి పోస్ట్‌ చేయకుండానే కొన్ని గంటల్లోనే లక్షల ఫాలోయర్లను సంపాదించుకున్నారు

Pawan Kalyan: ఇన్‌స్టా ఎంట్రీతో రికార్డే కాదు.. ఫస్ట్ ఫోస్ట్‌తో హీరోలందరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చాడు

జనసేనాని పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్‌ (instagram First post) చేశారు. ఈ నెల నాలుగో తేదిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరచిన ఆయన ఎలాంటి పోస్ట్‌ చేయకుండానే కొన్ని గంటల్లోనే లక్షల ఫాలోయర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 2.4 మిలియన్లను దాటింది. శనివారం ఆయన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ చేశారు. (Janasenani)

‘మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ..’ అంటూ రెండు నిమిషాల 40 సెకెన్ల వీడియో పోస్ట్‌ చేశారు.

అందులో చిరంజీవి, బాలకృష్ణ, అమితాబ్‌ బచ్చన్‌, వెంకటేశ్‌, నాగార్జున, మహేశ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ నుంచి హైపర్‌ ఆది వరకూ, హీరోలు, హీరోయిన్లు, కమెడీయన్లు, నిర్మాతలు, దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, పూరి జగన్నాథ్‌, కరుణాకరణ్‌తోపాటు పలువురు దర్శకులు, సంగీత దర్శకులు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు, తమిళ హీరోలు ఇలా అందరితో పవన్‌కల్యాణ్‌ ఉన్న ఫొటోలను ఓ వీడియోగా రూపొందించి ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌గా పెట్టారు.

'చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు’’ అని పేర్కొన్నారు. (Viral Video)


అభిమానులు అయితే ఈ పోస్ట్‌కు ఫిదా అవుతున్నారు. ఆయన పోస్ట్‌ చేసిన 12 నిమిషాల్లో వేల కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-07-15T18:42:12+05:30 IST