Ustad Bhagath Singh: మొత్తానికి పవన్ కళ్యాణ్ మొదలెట్టేసాడు

ABN , First Publish Date - 2023-04-05T11:08:56+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఆనందానికి అవధులు లేవు. పవన్ కళ్యాణ్ తో మొదలెట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ ఈరోజు మొదలయింది. అదే అతని ఆనందానికి కారణం

Ustad Bhagath Singh: మొత్తానికి పవన్ కళ్యాణ్ మొదలెట్టేసాడు

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటు రాజకీయాలతోనూ అటు సినిమాలతో బిజీ గా వున్నాడు. నిన్నటి వరకు ఢిల్లీలో (Delhi) బీజేపీ (BJP) నాయకులను కలుస్తూ హడావిడిగా వున్న జన సేన (Jana Sena) నేత పవన్ కళ్యాణ్ ఈరోజు అంటే బుధవారం నుండి తన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagath Singh) షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీనికి హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయింది. ఈ సినిమా తరువాత రెండు మూడు సినిమాలు అధికారికంగా ప్రకటించారు, వాటి షూటింగ్ కూడా మొదలెట్టేసాడు కానీ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదలెట్టలేదు.

ఎట్టకేలకు ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ మొదలెట్టాలని నిర్ణయించాడు. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు అయితే, ఇంకొక దర్శకుడు దశరధ్ (Dasarath) ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, కథ సమకూరుస్తున్నారు. నిన్న అంతా దశరథ్ ఈ సినిమా గురించి చర్చలు జరుపుతూనే వున్నాడు.

Janasena-Pawan.jpg

ఈ సినిమా ఒక యాక్షన్ సన్నివేశం తో మొదలెట్టాలని అనుకుంటున్నారు. అందుకే సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వున్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదలెట్టారని తెలుస్తోంది. అక్కడ ఒక పోరాట సన్నివేశాన్ని తీయాలని ఆ తరువాత షూటింగ్ అక్కడే కంటిన్యూ చేస్తారని కూడా తెలిసింది.

దర్శకుడు హరీష్ శంకర్ శోభన్ బాబు (Sobhan Babu) సినిమాలోని ఒక పాట క్లిప్ ట్వీట్ చేసాడు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్నినాళ్ళు దాచిన హృదయం ... ఇంకా తెలవారదేమి... అన్న పాట పెట్టాడు. అంటే అందులో ఎన్నో అర్థాలు వున్నాయి. ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ చేస్తున్నాడు, అది అతనికి సంతోషం. తరువాత సుజీత్ (Sujeeth) సినిమా 'ఓ.జి' (OG), క్రిష్ (Director Krish) సినిమా 'హరిహర వీరమల్లు' (HariHaraVeeramallu) కూడా ఇంకా చెయ్యాలి.

Updated Date - 2023-04-05T11:08:57+05:30 IST