Ram Charan: సినిమా వచ్చి 13 ఏళ్లు.. O Range సెలబ్రేషన్స్‌!

ABN , First Publish Date - 2023-03-26T18:49:41+05:30 IST

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కెరీర్‌ బిగినింగ్‌లో చేసిన ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ‘ఆరెంజ్‌’. ‘చిరుత’, మగధీర’ రెండు పెద్ద విజయాలు తర్వాత చేసిన చిత్రమిది.

Ram Charan: సినిమా వచ్చి 13 ఏళ్లు..  O Range సెలబ్రేషన్స్‌!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) కెరీర్‌ బిగినింగ్‌లో చేసిన ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ‘ఆరెంజ్‌’ (Orange). ‘చిరుత’, మగధీర’ రెండు పెద్ద విజయాలు తర్వాత చేసిన చిత్రమిది. హీరోగా చెర్రీకి మూడో సినిమా. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో నాగబాబు)Nagababu) నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించకపోయిన ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ అనే గుర్తింపు పొందింది. మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయింది. హారీస్‌ జైరాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. రామ్‌చరణ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేశారు(Orange re Release). శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అభిమానులు భారీగా ఈ చిత్రాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. ఒక రేంజ్‌లో ఫ్యాన్స్‌ సెలబ్రేషన్స్‌ చేస్తున్నారు. దాంతో ఆయా సినిమా హాళ్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు పాటలు పాడుతూ, స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. థియేటర్లలతో ప్రేక్షకులు చేస్తున్న సందడి క్లిప్‌ల రూపంలో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రం రీ రిలీజ్‌ వల్ల వచ్చే మొత్తాన్ని చిత్ర నిర్మాత జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు నాగబాబు వెల్లడించారు.

Updated Date - 2023-03-26T18:49:43+05:30 IST