Onam Festival: ఓనమ్‌ వేళ.. సందడి చేసిన మలయాళ బ్యూటీలు!

ABN , First Publish Date - 2023-08-29T19:37:59+05:30 IST

కేరళ ప్రజలకు ఓనమ్‌ ప్రత్యేక పండుగ. ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో కేరళవాసులు ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. 10 రోజులపాటు సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే ఈ పండుగ ఈ నెల 20న మొదలైన ఈ పండుగ 31వ తేదిన తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో పూర్తవుతుంది.

Onam Festival: ఓనమ్‌ వేళ.. సందడి చేసిన మలయాళ బ్యూటీలు!

కేరళ ప్రజలకు ఓనమ్‌ ప్రత్యేక పండుగ. ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో కేరళవాసులు ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. 10 రోజులపాటు సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే ఈ పండుగ ఈ నెల 20న మొదలైన ఈ పండుగ 31వ తేదిన తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో పూర్తవుతుంది. పది రోజులకు పైగా జరిగే ఈ పండుగలో మలయాళ మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు వేసి మధ్యలో దీపం వెలిగిస్తారు. దీనిని ‘పూకోళం’ అంటారు. అదే రోజు వామన, మహాబలిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున మలయాళీలు ప్రతి ఇంట చేేస ‘ఓనసద్యా’ అనే విందు చాలా ముఖ్యమైనది.

210.jpg

ఓనమ్‌ ప్రారంభం నుంచి మలయాళీ భామలు, తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణిస్తున్న కథానాయికలు ఈ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సంప్రాదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఓనమ్‌ అగోషం (సెలబ్రేషన్స్‌) అంటూ నెట్టింట్లో ఫొటోలతో సందడి చేశారు. కథానాయికలు కీర్తి సురేశ్‌, అనుపమా పరమేశ్వరన్‌, కల్యాణి ప్రియదర్శిన్‌, మంజిమా మోహన్‌, మాళవిక మోహనన్‌, పూర్ణ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ సంప్రదాయ దుస్తులు ఽధరించి కనులవిందు చేశారు.

11.jpg

సీనియర్‌ నటి సుహాసిని తన స్నేహితులతో కలిసి ఓనం జరుపుకొన్నారు. అలాగే నదియా కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేశారు.

యాంకర్‌ సుమ కనకాల తన తోటి యాంకర్లు అందరినీ తన ఇంటికి ఆహ్వానించి విందు(ఓన సద్యా) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కథానాయిక పూర్ణ నా బిడ్డ పుట్టిన తర్వాత తొలి ఓనమ్‌ పండుగ అంటూ ఫొటో షేర్‌ చేసింది.

Updated Date - 2023-08-29T21:34:30+05:30 IST