పవన్‌కల్యాణ్ పుట్టిన రోజున
ABN , First Publish Date - 2023-09-02T00:17:50+05:30 IST
యామినీ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి నటించిన ‘ప్రేమదేశపు యువరాణి’ చిత్రం శనివారం విడుదలవుతోంది. పవన్‌కల్యాణ్ వీరాభిమాని అయిన సాయి సునీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు....

యామినీ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి నటించిన ‘ప్రేమదేశపు యువరాణి’ చిత్రం శనివారం విడుదలవుతోంది. పవన్‌కల్యాణ్ వీరాభిమాని అయిన సాయి సునీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మాతలు. విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హీరో అరవింద్ కృష్ణ, శివారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందా లేదా అన్నది ముఖ్యం కాదు. నిర్మాతకు డబ్బులు వస్తే అదో పెద్ద సక్సెస్. కొత్త జానర్‌లో ఈ సినిమా తీశాం. పవన్‌కల్యాణ్‌గారి మీద ఉన్న అభిమానంతో ఆయన పుట్టిన రోజున ఈ సినిమా విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చిన నాకు హీరోగా అవకాశం వచ్చింది. మంచి టీమ్‌తో వర్క్ చేశా’ అన్నారు హీరో యామినిరాజ్. హీరోయిన్‌గా తనకు ఇది తొలి సినిమా అనీ, బలమైన ప్రేమకథతో చిత్రాన్ని తీశారనీ హీరోయిన్ ప్రియాంక చెప్పారు.