OG: నో ఫస్ట్ లుక్.. ఆ రోజున ఆకలితో ఉన్న చిరుతనే దించుతున్నామ్

ABN , First Publish Date - 2023-08-28T16:50:13+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ కథానాయిక. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఏం అప్‌డేట్‌ ఇస్తారా అని ప్రేక్షకలోకంతోపాటు అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

OG: నో ఫస్ట్ లుక్.. ఆ రోజున ఆకలితో ఉన్న చిరుతనే దించుతున్నామ్

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’(OG). సుజీత్‌ (Sujith) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ కథానాయిక. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఏం అప్‌డేట్‌ ఇస్తారా అని ప్రేక్షకలోకంతోపాటు అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం సర్‌ప్రైజ్‌ ఉంటుందో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సోషల్‌ మీడియా వేదికగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను ‘ఎక్స్‌’ ఖాతాను ట్యాగ్‌ చేసి, ‘మైండ్‌ పనిచేయట్లేదు. ఓజీ అప్‌డేట్‌ గురించి ఏదో ఒకటి చెప్పండి?’ అంటూ కోరాడు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘ఆగండి.. అన్నీ పేలతాయ్‌. ఇప్పటి వరకు చూడని దాన్ని.. సెప్టెంబరు 2న మీరు ఆశించొచ్చు’’ అంటూ అంచనాలు పెంచింది. ఓ సినిమాలోని ‘అన్నీ పేలతాయ్‌’ అనే డైలాగ్‌ను షేర్‌ చేసింది. (Aagandi… Anni Pelathaayi)

అంతే కాదు.. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పవన్‌ పుట్టినరోజు ట్రీట్‌గా ‘ఓజీ’ చిత్రంతో ఫస్ట్‌ లుక్‌ ఏమీ వదలడం లేదట. ఈ విషయాన్ని చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. సెప్టెంబర్‌ రెండో తేదిన ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడం లేదు. ఎగ్జైటింగ్‌ చేసే విజువల్స్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ రష్‌ను మీకు అందించాలనుకుంటున్నాం. ఆకలితో ఉన్న చిరుతనే మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ స్ర్కీన్స్‌ వూఫర్స్‌ రెడీ చేసుకోండి’’ అని ట్వీట్‌ చేశారు. ఫస్ట్‌ లుక్‌ లేదనగానే నిరాశపడిన అభిమానులు ‘ఆకలితో ఉన్న చిరుతనే మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అనగానే ఆనందంలో మునిగిపోయారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Updated Date - 2023-08-28T16:50:13+05:30 IST