NTR30: కొరటాల శివతో చేస్తున్న సినిమా టైటిల్ ఇదేనా...

ABN , First Publish Date - 2023-03-07T18:07:10+05:30 IST

ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రాబోయే సినిమా ప్రస్తుతం ఎన్టీఆర్30 గా అంటున్నారు. కానీ ఈ సినిమా కి ఒక పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని అనుకున్నారని, చాలా పేర్లు అనుకుంటే అందులో ఒకటి బయటకి లీక్ అయినట్టుగా తెలిసింది.

NTR30: కొరటాల శివతో చేస్తున్న సినిమా టైటిల్ ఇదేనా...

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో (Koratala Siva) సినిమా చెయ్యాల్సి వుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపొయింది, ఇంకా షూటింగ్ మొదలెట్టడమే తరువాయి. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ఆస్కార్ అవార్డు (Oscar Awards) కోసం అమెరికా (America) వెళ్ళటం తో ఈ సినిమా షూటింగ్ అతను తిరిగి వచ్చాక మొదలవుతుంది. అయితే సినిమా కూడా అధికారికంగా ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని రోజుల కిందట మొదలెట్టాలి అని అనుకున్నారు కానీ, నందమూరి తారకరత్న (NandamuriTarakaratna) అకాల మరణంతో ఈ సినిమా ప్రారంభం, షూటింగ్ అన్నీ వాయిదా పడ్డాయి.

ntr301.jpg

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అమెరికా నుండి రాగానే షూటింగ్ మొదలెట్టి ఆగకుండా చేస్తారు అని తెలిసింది. అయితే ఈ సినిమా కి ఏమి పేరు పెట్టాలా అని కొరటాల శివ, అతని టీం ఆలోచిస్తున్నారు అని తెలిసింది. అయితే కొందరు యూనిట్ సభ్యులు మాటలను బట్టి ఈ సినిమాకి 'దేవర' (Devara) అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారని తెలిసింది.

కొరటాల శివ ఎప్పుడూ తన సినిమాలకి కొంచెం బలమైన టైటిల్స్ వుండే విధంగా చూసుకుంటాడు. అందుకనే 'దేవర' అనే టైటిల్ పెట్టాడు అని కూడా తెలిసింది. అయితే ఈ టైటిల్ అధికారికంగా ధ్రువీకరించలేదు, తెలిసిన విషయం మాత్రమే. ఈ సినిమాకి ఏమి టైటిల్ అనే విషయం చిత్ర నిర్మాతలు, దర్శకుడు, ఎన్టీఆర్ అందరూ చర్చించి పెడతారని తెలిసింది. కానీ ఇప్పుడు 'దేవర' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నందున ఇది కూడా కాయం చేయొచ్చు అని కూడా అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , కొసరాజు హరికృష్ణ (Kosaraju Harikrishna) లు.

ఇది కూడా చదవండి:

*JrNTR: అమెరికాలో అభిమానులతో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు

Updated Date - 2023-03-07T18:07:15+05:30 IST