DasKaDhamki: ఎన్టీఆర్ రావటం వల్లే అంత ఓపెనింగ్స్ వచ్చాయా? సినిమా హిట్ కి అవే కారణాలా ...

ABN , First Publish Date - 2023-03-23T14:26:50+05:30 IST

విశ్వక్ సేన్ సినిమా 'దాస్ కి ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావటం ఆ సినిమా పెద్ద ఓపెనింగ్స్ రావటానికి ఒక కారణం అయితే, ఇంకా మిగతా కారణాలు ఏంటో తెలుసా ఆ సినిమా హిట్ దిశగా దూసుకుపోవాడానికి

DasKaDhamki: ఎన్టీఆర్ రావటం వల్లే అంత ఓపెనింగ్స్ వచ్చాయా? సినిమా హిట్ కి అవే కారణాలా ...

విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన 'దాస్ క ధమ్కీ' (Das Ki Dhamki) చిత్రం ఉగాది (Ugadi festival) పండగ నాడు విడుదల అయింది. మొదటి రోజు ఎవరూ ఊహించనంత విధంగా ఓపెనింగ్స్ వచ్చాయి ఈ సినిమాకి. సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ చేసాడు, ఒకటి హోటల్ లో వెయిటర్ గా, రెండోది ఒక రిచ్ వ్యాపారవేత్తగా. ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు కూడా విశ్వక్ సేన్ (Producer and director Vishwak Sen). అతని తండ్రి కరాటే రాజు (Karate Raju) కూడా ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు.

ntr-vishwaksen.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విశ్వక్ సేన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ (NTR) ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించగా, ఎన్టీఆర్ వచ్చాడు. అతను విశ్వక్ సేన్ గురించి చాలా గొప్పగా మాట్లాడేడు కూడా. ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకొని హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ మొదటి సారిగా ఈ విశ్వక్ సేన్ ఫంక్షన్ కి రావటం ఆసక్తికరం. ఇలా ఎన్టీఆర్ రావటమే ఈ సినిమాకి మొదటి రోజు అంత కలెక్షన్స్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్, నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా రావటం ఆ సినిమాని ఎలా అయినా చూడాలి అని రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేట్టు చేశారు అని అంటున్నారు.

Vishwak-Sen.jpg

దానికితోడు విశ్వక్ సేన్ కూడా మెల్ల మెల్లగా తన అభిమానుల్ని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇందులో అతని కొన్ని బూతులు (అంటే సగం సగం పదాలు) మాట్లాడుతాడు. ఇంతకు ముందు అయితే సెన్సార్ వాళ్ళు బీప్ సౌండ్ వేసేవారు, కానీ ఇప్పుడు ఆ బూతు మాట సగం చెప్పి ఊరుకుంటాడు. అందరికీ అర్థం అయిపోతుంది. ఆలా మాట్లాడటం యూత్ కి బాగా ఈ సినిమా ఎక్కింది అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. దానికితోడు హైపర్ ఆది(Hyper Aadhi), జబర్దస్త్ మహేష్ (Jabardasth Mahesh), విశ్వక్ సేన్ ల కామెడీ సన్నివేశాలు కొన్ని బాగా జనాలకి ఎక్కేశాయి అని కూడా అంటున్నారు.

ఇన్ని కారణాలతో, ఈ 'దాస్ కి ధమ్కీ' పెద్ద హిట్ దిశగా దూసుకుపోతోంది. నిర్మాతగా కూడా విశ్వక్ సేన్ మంచి విజయం సాధించినట్టే. ఈ సినిమా ఓ.టి.టి, సాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదు. ఇప్పుడు చూడాలి అవి ఇంతకీ వెళతాయో.

Updated Date - 2023-03-23T14:26:51+05:30 IST