Devara: ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌.. ఈ విషయం తెలిస్తే ఇక ఆగలేరు

ABN , First Publish Date - 2023-06-26T17:06:05+05:30 IST

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న 30వ చిత్రం ‘దేవర’ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల శంషాబాద్‌లో ఓ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తిచేశారు. ఇటీవల ఎన్టీఆర్‌ కుటుంబంతో కలిసి దుబాయ్‌ విహారానికి వెళ్లారు. ఆయనన హైదరాబాద్‌ వచ్చాక తాజా షెడ్యూల్‌ మొదలుపెడతారని తెలిసింది. అయితే ఈ చిత్రం సెట్స్‌ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

Devara: ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌.. ఈ విషయం తెలిస్తే ఇక ఆగలేరు

సముద్రం తీరం...

పెద్ద పోర్ట్‌..

అప్పుడే పోర్టుకు చేరుకున్న భారీ ఓడ

అందులో ఉన్న కంటైనర్‌లను వశం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతినాయకుడు

కట్‌ చేస్తే హీరో ఎంట్రీ... (Devara Intro scene)

ఒక్కసారి నీటి నుంచి ఓడ పైకి ఎగిరిన వైనం

ఇదే హీరో ఇంట్రడక్షన్‌ షాట్‌...

కొరటాల శివ తాజాగా తారక్‌పై తెరకెక్కించిన సన్నివేశం...

ఇదంతా వైజాగ్‌, చెన్నై కాకినాడ వంటి షిప్‌ యార్డ్‌లో తీశారానుకుంటే పొరపాటే. ఇదంతా ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌ చేసిన మాయాజాలం. ఈ సినిమా కోసం ఏకంగా సముద్రాన్ని, షిప్‌యార్డ్‌ను ఆయన హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఆ కథేంటో మీరు చదివేయండి!

ఎన్టీఆర్‌ (Jr ntr) హీరోగా తెరకెక్కుతున్న 30వ చిత్రం ‘దేవర’ (Devara) కొరటాల శివ దర్శకత్వం (koratala siva) వహిస్తున్నారు. ఇటీవల శంషాబాద్‌లో ఓ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తిచేశారు. ఇటీవల ఎన్టీఆర్‌ కుటుంబంతో కలిసి దుబాయ్‌ విహారానికి వెళ్లారు. ఆయనన హైదరాబాద్‌ వచ్చాక తాజా షెడ్యూల్‌ మొదలుపెడతారని తెలిసింది. అయితే ఈ చిత్రం సెట్స్‌ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

12.jpg

హైదరాబాద్‌లో సముద్రం...

విస్మరించబడిన ఓ తీర ప్రాంతం, అక్కడి జనాల నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిదని దర్శకుడు ముందే తెలిపారు. తీర ప్రాంతం అంటే తప్పనిసరిగా సముద్ర ప్రాంతంలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. అయితే సాబు సిరిల్‌ దీని కోసం అద్భుతమైన సెట్స్‌ వేశారు. వైజాగ్‌లో సముద్ర తీర ప్రాంతాన్ని, షిప్‌యార్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విశాలమైన ప్రాంగణంలో సముద్రం సెట్స్‌ నేచురల్‌గా తీర్చిదిద్దారు సాబు సిరిల్‌. ఆ సెట్‌లోనే భారీ ఓడ, చుట్టూ పడవలు, ఓడలో ట్రాన్స్‌పోర్ట్‌ అయ్యే కంటైనర్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ ఓడలో దేవర ఇంట్రడక్షన్‌ సీన్‌ తీశారు. ప్రతినాయకుడు ఆ కంటైనర్‌లో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ తెరకెక్కించారు. నీటి నుంచి ఓడ పైకి హీరో ఎగిరివచ్చే ఇంట్రో సీన్‌ను ఇటీవల తెరకెక్కించారు కొరటాల శివ. సముద్రం సెట్‌ను, ఓడ, పోర్ట్‌ చూస్తే ఒరిజినల్‌గా విశాఖ పోర్ట్‌లోనే సన్నివేశాలను చిత్రీకరించారా అన్న అనుమానం రాకమానదు అని యూనిట్‌ సభ్యులు తెలిపారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. ఈ సముద్ర, ఓట సెట్‌కు భారీగా ఖర్చు చేశారని యూనిట్‌లో ఒకరు చెప్పారు.

ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ పతాకంపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-06-26T17:11:04+05:30 IST