NTR30: షాకింగ్ డ్రెస్ లో ఎన్టీఆర్ హీరోయిన్, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-04-27T14:10:24+05:30 IST

ఎన్టీఆర్ హీరోయిన్ మరోసారి విజృంభించింది. తన ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ డ్రెస్ లో ఫోటోస్ పెట్టి అందరినీ అలరించింది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ ఫోటోస్ ఎలా వున్నాయంటే...

NTR30: షాకింగ్ డ్రెస్ లో ఎన్టీఆర్ హీరోయిన్, ఫోటోస్ వైరల్
Janhvi Kapoor

ఈమధ్య చాలామంది నటీమణులు వెండి తెర మీద చూపించినా చూపించకపోయినా, సాంఘీక మాధ్యమాల్లో మాత్రం విపరీతంగా అందాలు ఒలకబోస్తున్నారు. అందులో బాలీవుడ్ కి చెందిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా వుంది. జాన్వీ కపూర్ ప్రతి రోజు ఎదో ఒక ఫోటో, లేదా ఫోటోస్ పెడుతూ ఉంటుంది తన ఇన్స్టాగ్రామ్ లో. అభిమానులు ఆ ఫోటోస్ చూసి ఆమెకి ఫాలో అవుతూ వుంటారు.

janhvikapoornew2.jpg

జాన్వీ ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి కూడా అరంగేట్రం చేస్తూ వుంది. ఆమె ఎన్టీఆర్ #NTR పక్కన, కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం లో వస్తున్న #NTR30 సినిమాలో కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ కోసం హైదరాబాద్ కూడా వచ్చింది.

janhvikapoornew1.jpg

సినిమాలు ఒకపక్క చేస్తున్నా కూడా, జాన్వీ ఫోటోస్ అప్డేట్ మాత్రం ఆపకుండా చేస్తుంది. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో చెపుతూ తనకి కట్టాల్సిన EMI లు ఉన్నాయని, అందుకనే అలంటి ఫోటోస్ పెడతా అని చెప్పుకొచ్చింది. ఆలా పెడితే ఫాలోవర్స్ పెరుగుతారని, ఆలా పెరగడం వలన యాడ్స్ వస్తాయని చెప్పుకొచ్చింది.

janhvikapoornew.jpg

జాన్వీ కపూర్ ఎప్పుడూ తన సినిమా పాత్రకి సంబంధం లేని ఫోటోస్ తన ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సినిమా కోసం ఎలాగు బయట ప్రచారాల్లో పాల్గొంటుంది కాబట్టి, ఇక్కడ ఆ సినిమా పాత్రకి సంబంధించి ఫోటోస్ అప్డేట్ అందుకే చెయ్యటం లేదు అని కూడా అనింది.

Updated Date - 2023-04-27T14:10:24+05:30 IST