ఎన్టీఆర్‌ దేవర

ABN , First Publish Date - 2023-05-20T02:46:33+05:30 IST

ఎన్టీఆర్‌ ‘దేవర’గా రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో (‘ఎన్‌టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే....

ఎన్టీఆర్‌ దేవర

ఎన్టీఆర్‌ ‘దేవర’గా రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో (‘ఎన్‌టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న ఎన్‌టీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు శుక్రవారం ఎన్‌టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సముద్రపు అలలు ఎగిసిపడుతుండగా చేతిలో గొడ్డలితో ఎన్టీఆర్‌ గంభీరంగా కనిపించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువసుధ, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Updated Date - 2023-05-20T02:46:33+05:30 IST