MAD: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది డెబ్యూ సినిమా రెడీ!

ABN , First Publish Date - 2023-08-31T11:22:11+05:30 IST

సూర్యదేవరణ రాధాకృష్ణ కుమార్తె హారిక నిర్మాతగా పరిచయం అవుతున్న 'మ్యాడ్' సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కూడా నటుడిగా పరిచయం అవుతున్నాడు. అలాగే దర్శకుడిగా కళ్యాణ్ శంకర్ కి కూడా ఇదే మొదటి సినిమా.

MAD: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది  డెబ్యూ సినిమా రెడీ!
A still from the film MAD

మామూలుగా అయితే స్టార్ ల కొడుకులు, కూతుర్లు నటులుగా సినిమా ఆరంగేట్రం చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు స్టార్ ల బావమరుదులు కూడా సినిమాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) బావమరిది నార్నే నితిన్ (NarneNithin) 'మ్యాడ్' #MAD అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. (SitharaEntertainments) దీనికి కళ్యాణ్ శంకర్ (KalyanShankar) అనే అతను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అలాగే ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (SuryadevaraRadhakrishna) కుమార్తె, హారిక సూర్యదేవర (HarikaSuryadevara) నిర్మాతగా ఈ సినిమాతో పరిచయం అవుతోంది. ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) భార్య సౌజన్య (SaiSoujanya) ఈ సినిమాకి సహ-నిర్మాత.

narnenithin1.jpg

ఈ 'మ్యాడ్' #MAD సినిమా కాలేజీ నేపథ్యంలో తీసిన సినిమా అని ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. కాలేజీ క్యాంపస్ లో జరిగిన గొడవలు, విద్యార్థుల మధ్య భేదాభిప్రాయాలు, రాగింగ్, అలాగే కొంచెం రెండర్థాల మాటలు కూడా ఈ టీజర్ లో కనిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తో పాటు, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఇంకా చాలామంది ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారని తెలుస్తోంది.

ఇటీవల 'ధమాకా' #Dhamaka సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో (BheemsCeciroleo) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

Updated Date - 2023-08-31T11:22:11+05:30 IST