NTR30: సముద్రం మీదకెళితే ఆడుంటాడురా అక్కడ... ఇది ఎన్టీఆర్30 కథ

ABN , First Publish Date - 2023-04-24T12:50:44+05:30 IST

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్30 కథ కొంచెం లీక్ అయింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఇంతకు తెలుగు సినిమాలలో చూడని విధంగా వుంటాయని, ఆలా డిజైన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది

NTR30: సముద్రం మీదకెళితే ఆడుంటాడురా అక్కడ... ఇది ఎన్టీఆర్30 కథ

కొరటాల శివ (Koratala Siva), ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్ లో వస్తున్న 'ఎన్టీఆర్ 30' #NTR30 షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక సముద్రం (Sea Set) సెట్ హైదరాబాద్ లో వేసినట్టుగా తెలుస్తోంది. అలాగే కొన్ని కీలక సన్నివేశాల కోసం, విశాఖపట్నం, గోవా లాంటి బీచులు వున్న ప్రదేశాలకి కూడా వెళతారు అని కూడా తెలుస్తోంది. అయితే ఈ ఎన్టీఆర్30 #NTR30 నుంచి అసలు కథ ఎలా వుండబోతోంది అనే విషయం చిన్న చిన్నగా లీక్ అవుతోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదొక పెద్ద మాస్ మూవీగా కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ntr30a.jpg

కొరటాల శివ ఈ సినిమా ప్రారంభోత్సవం రోజు కథ గురించి కొంత చెప్పారు. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకి ఈ కథ మీద కొంచెం అవగాహన వచ్చే ఉంటుంది. ఇదొక పీరియడ్ డ్రామా కథ అని కూడా తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ #NTR30 పేరు దేవర #Devara అని చాలా రోజుల క్రితమే సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయింది. అలాగే ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంతవరకు ఈ తెలుగు సినిమాలో లేని ఒక హై ఎనర్జీ తో ఆ పోరాట సన్నివేశాలు ఉంటాయి అని యూనిట్ సభ్యులు అంటున్నారు.

NTR304.jpg

సైఫ్ అలీ ఖాన్ #SaifAliKhan ఇందులో విలన్. ఇతను ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని కొండల్లో ఉంటూ ఉంటాడు. ఇతను అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో చీమ కదలాలి అన్న ఇతనికి తెలియకుండా కదలదు, అంతగా అక్కడ గ్రామాల్లో ఇతను అధికారం చెలాయిస్తూ ఇబ్బందులను పెడతాడు. కానీ వీళ్ళందరికీ దేవుడంటే భయం లేదు కానీ ఒక్కడంటే భయం అని చెప్పాడు కదా కొరటాల శివ, ఆ ఒక్కడు ఎవరంటే దేవర అంటే ఎన్టీఆర్. అందుకే వీళ్ళు గ్రామాల్లో ప్రజలని ఎంత ఇబ్బంది పెడుతున్న ఆ సముద్రం మీదకి మాత్రం పోరు, ఎందుకంటే అక్కడ ఆడుంటాడు, అదే ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ నిజంగా ఉన్నడా, అక్కడ లేదా, విలన్స్ ఎందుకు అంత భయపడుతున్నారు అన్నది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొరటాల ఒక హై వోల్టాగే డ్రామా గా తీస్తాడు అని అందరికీ నమ్మకం.

NTR30-new.jpg

అందుకే ఏ ఎన్టీఆర్30 అనేది ఒక యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఒకదానికి మించి ఇంకొకటి వున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్వాహకులు. ఎన్టీఆర్ కొడుకుగా కూడా మళ్ళీ ఎన్టీఆర్ వేస్తున్నాడు ఇందులో. అతనికి జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేస్తోంది.

Updated Date - 2023-04-24T12:50:44+05:30 IST