NTR30: అప్పుడే రెండో షెడ్యూల్ కూడా అయిపొయింది, ఎన్టీఆర్ సూపర్ ఫాస్టున్నాడు

ABN , First Publish Date - 2023-05-03T11:17:06+05:30 IST

కొరటాల శివ, ఎన్టీఆర్ తో చేస్తున్న ఎన్టీఆర్30 అప్పుడే సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్టు రత్నవేలు ట్విట్టర్ లో పెట్టాడు. ఇది ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ సన్నివేశం అని చెప్పాడు. ఎన్టీఆర్ చాల ఫాస్టుగా షూటింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

NTR30: అప్పుడే రెండో షెడ్యూల్ కూడా అయిపొయింది, ఎన్టీఆర్ సూపర్ ఫాస్టున్నాడు

ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో ఎన్టీఆర్30 #NTR30 షూటింగ్ చాలా ఫాస్ట్ గా సాగుతోందని తెలుస్తోంది. అప్పుడే సెకండ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది అని అంటున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) కథానాయికగా నటిస్తోంది, ఆమె మీద కూడా ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా ఒక యాక్షన్ సినిమా గా తెరకెక్కబోతోంది అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈసారి ఒక అద్భుత పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (Ratnavelu) ట్విట్టర్ లో పెట్టాడు. ఈ పోరాటానం ఎన్టీఆర్ స్టైల్ లో ఒక మాస్ ఫైట్ అన్నట్టుగా ర్యాంతవేలు చెప్పుకొచ్చాడు. ఈ పోరాట సన్నివేశంలో ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాలో విలన్ గా వేస్తున్న సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) కూడా పాల్గొన్నాడు.

ntr30.jpg

ఇదే పోస్టులో రత్నవేలు #వస్తున్నా అన్న హేష్ టాగ్ కూడా పెట్టాడు. అంటే వస్తున్నా అన్నది టాగ్ లైన్ గానో, లేదా సినిమాకి సంబంచిందినదో, లేదా ఎన్టీఆర్ ఈ సినిమాతో వస్తున్నడో, ఏ విషయం తెలియాల్సి వుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు 'దేవర' అని ఆమధ్య లీక్ అయింది. అందుకే ఈ సినిమాకి 'దేవర' అన్న టైటిల్ కూడా పెట్టొచ్చు అని అన్నారు కూడా.

ntr301.jpg

ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ వేస్తున్నట్టు ఆల్రెడీ వార్త బయటకి వచ్చింది. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ కనపడనున్నాడు ఇందులో. అయితే మరి ఇద్దరి ఒకరినొకరు కలుసుకుంటారా, లేదా తండ్రి పోయాక, కోడు ఆ తండ్రి కోరిక నెరవేర్చడానికి రంగం లోకి దిగుతాడా అన్నది ఇంకా తెలియాల్సి వుంది. ఒక ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ (Nandamuri Kalyan Ram) రామ్ ప్రొడ్యూసర్ చేస్తున్నాడు.

Updated Date - 2023-05-03T11:17:06+05:30 IST