Jamuna: నన్ను ఇబ్బంది పెట్టడానికే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ బాయ్‌కాట్‌ చేశారు

ABN , First Publish Date - 2023-01-27T12:06:27+05:30 IST

‘‘అభిమానుల దృష్టిలో జమున అంటే గ్లామర్‌ క్వీన్‌.. ఆత్మాభిమానం ఉన్న మనిషి.. డబ్బుకోసం చిన్నచిన్న పాత్రలు చేసి నా పేరును పాడు చేసుకోవడం ఇష్టం లేదు. నటిగా నాది తిరుగులేని జర్నీ..

Jamuna: నన్ను ఇబ్బంది పెట్టడానికే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ బాయ్‌కాట్‌ చేశారు

‘‘అభిమానుల దృష్టిలో జమున అంటే గ్లామర్‌ క్వీన్‌..(Jamuna)

ఆత్మాభిమానం ఉన్న మనిషి. (Rip jamuna)

డబ్బుకోసం చిన్నచిన్న పాత్రలు చేసి నా పేరును పాడు చేసుకోవడం ఇష్టం లేదు.

నటిగా నాది తిరుగులేని జర్నీ..

అంతకుమించి ఓ నటికి ఏం కావాలి’’

ఓపెన హార్ట్‌ విత్‌ ఆర్కేలో జమున చెప్పుకొచ్చిన విశేషాలివి. (Ntr and ANR boycotted jamuna )

14 ఏళ్ల వయసులో నటిగా వెండితెరకు పరిచయమైన జమున .30 ఏళ్లపాటు హీరోయిన్‌గా దక్షిణాది సినీ ప్రియుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆత్మాభిమానం ఉన్న మహిళగా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శుక్రవారం ఆమె కన్ను మూశారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుందాం.

సినిమారంగానికి దూరమై 30 ఏళ్లు కావొస్తుంది. మూడు దశాబ్ధాలపాటు సినీరంగంలో కొనసాగాను. ఇప్పుడు ఏదో కోల్పోయానన్న ఫీలింగ్‌ నాకులేదు. ఎందుకంటే నేను చేలా బిజీగా ఉన్నా. హైదరాబాద్‌ వచ్చేశాకా సమాజ సేవతో తీరకలేకుండా ఉన్నా. సినిమా రంగంనుంచి బయటకు వచ్చి తర్వాత అనేక విషయాలు తెలుసుకున్నా.

భానుమతిగారు ఆదర్శం...

సినీ పరిశ్రమలో మగవారిని కాదని ఏమీ చేయలేమని, వారు చెప్పినట్లు చేస్తేనే మంచిదని, ఇండస్ర్టీలో గౌరవాన్ని కోల్పోకుండా ఏ స్టార్‌ కూడా ఉండలేరు అని ఓ సీనియర్‌ నటి అన్నప్పుడు ఎలా ఉండలేమో నేనూ చూస్తాను అని చెప్పాను. అదే విధంగా ఇప్పటివరకూ ఉన్నా. ఇలా ఉండడానికి నాకు భానుమతిగారే ఆదర్శం. ఆవిడ అంటే నాకు చాలా అభిమానం. ఆవిడని మేడమ్‌ అని పిలిచేదాన్ని.

5.jpg

వారిద్దరే నన్ను బాయ్‌కాట్‌ చేశారు...

ఎవరి మాటా వినకుండా.. ఆత్మాభిమానంతో ఉండే మహిళ అంటే అందరికీ కంటగింపే. ఎందుకంటే అటువంటి మహిళ ఎదురైతే వారి అహంకారం దెబ్బతింటుంది. అందుకని నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎన్టీఆర్‌ -ఏయన్నార్‌ కలిసి బాయ్‌కాట్‌ చేశారు. వారిలో ఒకరు అమాయకుడే. నేను క్షమాపణ చెప్పాలన్నారు. సినిమాలు చేయడం మానైనా మానేస్తాను గానీ ఎవరికీ తలవంచనని స్పష్టం చేశాను. చివరికి చక్రపాణిగారు సర్దిచెప్పడం వల్ల వివాదం సమసిపోయింది.

అనుకోకుండా జరిగింది...

శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్‌ తల మీద తన్నడానికి పాత గొడవ కారణం అని చాలామంది అనుకుంటారు. అలాంటిదేమీ లేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పా. ఆడవారిని ఎలా గౌరవించాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలి.

8.jpg

Updated Date - 2023-01-27T12:08:11+05:30 IST