సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR: కుటుంబంతో కలిసి విహార యాత్రకి వెళ్లిన ఎన్టీఆర్

ABN, First Publish Date - 2023-05-29T12:00:04+05:30

ఎన్టీఆర్ తన కుటుంబంతో వెకేషన్ కి వెళ్ళాడు. ఇద్దరి కుమారులు, భార్య తో కలిసి వెళుతున్న ఫోటోస్ సాంఘీక మాధ్యమం లో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ తో 'దేవర' సినిమా షూటింగ్ లో పాల్గొంటూ, మధ్యలో ఇలా బ్రేక్ తీసుకొని కుటుంబంతో విహార యాత్రకి వెళ్ళాడు.

NTR and his wife Pranathi at the airport
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి సెలవలు వస్తున్నాయి అంటే స్కూల్, కాలేజీ పిల్లలకు సెలవలు ఇచ్చేస్తారు కదా. మరీ అందరితో పాటు తెలుగు సినిమా నటులు కూడా వేసవి సెలవుల్లో చాలామంది తమ పిల్లలని విహారా యాత్రలకు తీసుకు వెళుతూ వుంటారు. మహేష్ బాబు(MaheshBabu), అల్లు అర్జున్ (AlluArjun), ఎన్టీఆర్ (NTR) లాంటి నటులు తమ పిల్లలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని వెకేషన్స్ కి తీసుకు వెళుతూ వుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) కూడా తమ కుటుంబంతో విహార యాత్రకి వెళ్ళాడు. అతను వెళుతున్నప్పుడు ఎయిర్ పోర్ట్ లో అతనివి, కుటుంబ ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్, భార్య ప్రణతి (Pranathi), ఇద్దరు కుమారులతో విహార యాత్రకి ఆదివారం వెళ్లినట్టుగా ఈ ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ (KoratalaSiva) కాంబినేషన్ లో వస్తున్న 'దేవర' #Devara సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. మధ్యలో ఇలా కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని, కుటుంబంతో ఆలా వెకేషన్ కి వెళుతున్నారు. ఇది చాలా చిన్న ట్రిప్ అని, మళ్ళీ వచ్చి 'దేవర' #Devara సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు అని చెప్తున్నారు. ఇందులో బాలీవుడ్ కి చెందిన జాన్వీ కపూర్ (JahnviKapoor) కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ ఆలీ ఖాన్ (SaifAliKhan) విలన్ గా చేస్తున్నాడు.

ఈ సినిమా ఒక పాన్ ఇండియా స్థాయిలో తీర్చి దిద్దుతున్నట్టుగా తెలిసింది. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చెయ్యడానికి పిలిపించుకున్నారు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి కదా. ఇందులో ఇంకో కథానాయిక కూడా ఉంటుంది అని, అది త్వరలో తెలియవస్తుందని అంటున్నారు.

Updated Date - 2023-05-29T12:00:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!