NTR 30: అప్‌డేట్‌ అదిరింది!

ABN , First Publish Date - 2023-01-31T19:54:45+05:30 IST

ఎన్టీఆర్‌ 30 (NTR30) సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయిలో చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అందుకు పలు కారణాలున్నాయి.

NTR 30: అప్‌డేట్‌ అదిరింది!

ఎన్టీఆర్‌ 30 (NTR30) సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయిలో చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అందుకు పలు కారణాలున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘(RRR) జపాన్‌లో విడుదల, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కార్యక్రమం ఇలా బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు పూర్తిగా ఎన్టీఆర్‌ 30 (Ntr 30 shoot from march) చిత్రంపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలఖరు నుంచి ఓ చిన్న షెడ్యూల్‌ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఫిబ్రవరిలో షెడ్యూల్‌ ప్రారంభం కాకపోతే మార్చి నుంచి భారీ షెడ్యూల్‌ మొదలుకానుందని యూనిట్‌ వర్గాల టాక్‌. ఈ షెడ్యూల్‌ కోసం శంషాబాద్‌ దగ్గర ఓ చోట సెట్‌ వర్క్‌ జరుగుతోంది. హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ముగిశాక గోవాలో మరో షెడ్యూల్‌ ఉంటుందనీ, ఆ తర్వాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం. ఈ వార్త వైరల్‌ కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌ మంచి హుషారులో ఉన్నారు. జనతా గ్యారేజ్‌ తర్వాత కొరటాల శివ - తారక్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్‌ 5న చిత్రాన్ని (NTR 30on April 5 2024)విడుదల చేయనున్నారు.

Untitled-2.jpg

Updated Date - 2023-01-31T19:59:36+05:30 IST