Ntr 30: భారీ యాక్షన్‌తో... మొదలుపెట్టారు!

ABN , First Publish Date - 2023-03-31T09:41:51+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (Ntr 30) ఆస్కార్‌ అవార్డ్‌ పనులన్నీ ముగించుకుని హైదరాబాద్‌ చేరిన తారక్‌ ఎన్టీఆర్‌ 30 చిత్రంతో బిజీ కానున్నారు.

Ntr 30: భారీ యాక్షన్‌తో... మొదలుపెట్టారు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (Ntr 30) ఆస్కార్‌ అవార్డ్‌ పనులన్నీ ముగించుకుని హైదరాబాద్‌ చేరిన తారక్‌ ఎన్టీఆర్‌ 30 చిత్రంతో బిజీ కానున్నారు. కొరటాల శివ (Koratala siva) దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఎన్టీఆర్‌30’ (Ntr30) ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే! దీంతో సినిమా అప్‌డేట్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఇప్పుడు మరో శుభవార్త అభిమానులకు అందింది. ఈ చిత్రం షూటింగ్‌ గురువారం నుంచి మొదలైంది. హైదరాబాద్‌లో వేసిన సెట్లో తొలి షెడ్యూల్‌ మొదలైంది. యాక్షన్‌ సన్నివేశాలతో చిత్రీకరణ షురూ చేశారని, హీరో సహా కీలక పాత్రధారులపై ఈ చిత్రంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలిసింది. మరో పక్క నగరశివార్లో భారీ పొర్ట్‌ సెట్‌ పనులు కూడా జరుగుతున్నాయని వినికిడి. యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్లు పని చేయబోతున్నారని టాక్‌ నడుస్తోంది. (shootng started with Action)

‘‘విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిదని చిత్ర బృందం నుంచి సమాచారం. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమని, ఇందులో ఎన్టీఆర్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారని చిత్ర బృందం తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో కొసరాజు హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. జాన్వీ (Janhvi Kapoor) తెలుగులో నటిస్తున్న తొలి చిత్రమిది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-03-31T09:59:01+05:30 IST